HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Hardik Pandya Birthday Team India All Rounder Turns 30 Today

Hardik Pandya Birthday: టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ బర్త్ డే స్పెషల్.. పాండ్యా కెరీర్‌లో ప్రత్యేక విజయాలు ఇవే..!

బుధవారం భారత క్రికెట్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పుట్టినరోజు (Hardik Pandya Birthday). పాండ్యా అక్టోబర్ 11, 1993న జన్మించాడు. హార్దిక్ ఈరోజు తన 30వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.

  • By Gopichand Published Date - 01:42 PM, Wed - 11 October 23
  • daily-hunt
Hardik Pandya
Hardik Pandya

Hardik Pandya Birthday: బుధవారం భారత క్రికెట్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పుట్టినరోజు (Hardik Pandya Birthday). పాండ్యా అక్టోబర్ 11, 1993న జన్మించాడు. హార్దిక్ ఈరోజు తన 30వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా హార్దిక్ పాండ్యా ప్రపంచ కప్‌లో భారతదేశం రెండవ మ్యాచ్‌లో ఆడబోతున్నాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ అద్భుతంగా రాణిస్తే అతని పుట్టినరోజు చాలా ప్రత్యేకంగా మారుతుంది. హార్దిక్ పాండ్యా పుట్టినరోజు సందర్భంగా అతని కెరీర్‌లో కొన్ని ప్రత్యేక విజయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. !

హార్దిక్ పాండ్యా 30వ పుట్టినరోజు

ప్రస్తుత కాలంలో హార్దిక్ పాండ్యా భారతదేశపు అత్యుత్తమ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్. అతను కొత్త బంతితో బౌలింగ్‌ను కూడా ప్రారంభించగలడు. బ్యాటింగ్‌లో 3 నుండి 7 నంబర్‌ వరకు బ్యాటింగ్ కు దిగి తన బాధ్యతను చక్కగా నిర్వర్తించగలడు. హార్దిక్ ఐపీఎల్‌లో కూడా గుర్తింపు పొందాడు. ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నప్పుడు అద్భుతంగా రాణించాడు. ఆ తర్వాత టీమ్ ఇండియాలో చోటు సంపాదించి భారత అత్యుత్తమ ఆల్ రౌండర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. హార్దిక్ ఐపీఎల్‌లోనే కాకుండా భారత జట్టుకు కూడా ఎన్నోసార్లు చిరస్మరణీయమైన ప్రదర్శనలు ఇచ్చాడు.

Also Read: Mysterious Climate in Kodurupaka : ఆ గ్రామంలో 4 గంటలకే చీకటి..కారణం ఏంటి..?

We’re now on WhatsApp. Click to Join.

అంతర్జాతీయ క్రికెట్‌లో హార్దిక్ పాండ్యా ప్రదర్శన

– జనవరి 26, 2016న అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా భారత క్రికెట్ జట్టుకు అరంగేట్రం చేశాడు. అతని ODI అరంగేట్రం కూడా అక్టోబర్ 2016లో, అతని టెస్ట్ అరంగేట్రం జూలై 2017లో జరిగింది.
– హార్దిక్ తన T20 కెరీర్‌లో ఆడిన 92 మ్యాచ్‌లలో 139.83 స్ట్రైక్ రేట్, 25.43 సగటుతో 1348 పరుగులు చేశాడు.
– ODI ఫార్మాట్‌లో అతను 83 మ్యాచ్‌లలో 34.01 సగటుతో, 110.35 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 1769 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని అత్యుత్తమ స్కోరు 91 నాటౌట్.
– టెస్ట్ ఫార్మాట్‌లో 11 మ్యాచ్‌ల 8 ఇన్నింగ్స్‌లలో హార్దిక్ 31.29 సగటుతో మొత్తం 532 పరుగులు చేశాడు. ఇందులో 108 పరుగుల ఏకైక సెంచరీ ఇన్నింగ్స్ కూడా ఉంది.
– ఈ సెంచరీ ప్రత్యేకత ఏంటంటే.. టెస్టు మ్యాచ్‌లో లంచ్‌కు ముందు సెంచరీ చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా హార్దిక్ పాండ్యా నిలిచాడు.
– బౌలింగ్‌లో హార్దిక్ టీ20లో 73, వన్డేల్లో 80, టెస్టు ఫార్మాట్‌లో 17 వికెట్లు పడగొట్టాడు.
– టీ20 మ్యాచ్‌ల్లో 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసి 4 వికెట్లు తీసిన ఏకైక భారత ఆటగాడు హార్దిక్.

ఐపీఎల్‌లో హార్దిక్ పాండ్యా ప్రదర్శన

– ఐపీఎల్‌లో హార్దిక్ పాండ్యా అరంగేట్రం 2015లో జరిగింది.
– ఐపీఎల్‌లో ఇప్పటివరకు 123 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 30.38 సగటు, 145.86 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 2,309 పరుగులు చేశాడు. ఈ సమయంలో పాండ్యా 10 అర్ధ సెంచరీలు చేశాడు. ఇందులో అతని అత్యుత్తమ ఇన్నింగ్స్ 91 పరుగులు.
– బౌలింగ్‌లో హార్దిక్ 33.26 సగటుతో 53 వికెట్లు, ఎకానమీ 8.80. 17 పరుగులిచ్చి 3 వికెట్లు తీయడం అతని అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన.
– హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నప్పుడు నాలుగుసార్లు, గుజరాత్ టైటాన్స్‌తో ఒకసారి కెప్టెన్‌గా మొత్తం ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.
– హార్దిక్ కెప్టెన్‌గా రెండుసార్లు IPL ఆడాడు. రెండు సార్లు తన జట్టు గుజరాత్ టైటాన్స్‌ను ఫైనల్స్‌కు తీసుకెళ్లాడు.
– IPL 2022లో ఛాంపియన్ గా జట్టుని నిలిపాడు. కానీ 2023 ఫైనల్‌లో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో గుజరాత్ జట్టు ఓడిపోయింది.
– ఐపీఎల్ 2022లో హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా 487 పరుగులు చేసి 8 వికెట్లు తీశాడు.
– రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఐపిఎల్ 2022 ఆఖరి మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా బంతి, బ్యాటింగ్‌తో అద్భుత ప్రదర్శన చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2023 ODI World Cup
  • Hardik Pandya
  • Hardik Pandya Birthday
  • ICC ODI World Cup 2023
  • IND vs AFG

Related News

Asia Cup Super 4

Asia Cup Super 4: నేడు బంగ్లాతో భార‌త్ మ్యాచ్‌.. గెలిస్తే ఫైన‌ల్‌కే!

టీమిండియాకు ఆసియా కప్ 2025 చాలా గొప్పగా సాగింది. ఇప్పటివరకు టీమిండియా తమ అన్ని మ్యాచ్‌లలో గెలిచింది. ఈ టోర్నమెంట్‌లో సూర్యకుమార్ నేతృత్వంలోని టీమిండియా రెండుసార్లు పాకిస్తాన్‌ను ఓడించింది.

  • IND vs PAK Final

    Asia Cup: భారత ఫీల్డింగ్ తప్పిదాలు.. పాకిస్థాన్ మెరుగైన లక్ష్యంతో మైదానంలోకి

  • Hardik Pandya

    Hardik Pandya: వీడియో.. బౌండ‌రీ లైన్ వ‌ద్ద హార్దిక్ పాండ్యా క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా..?

Latest News

  • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

  • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

  • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

  • Jubilee Hills Bypoll: బిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

  • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

Trending News

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    • BCCI: ఇద్ద‌రి ఆటగాళ్ల‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. కారణ‌మిదే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd