Hardik Pandya: భార్యను మళ్లీ పెళ్లి చేసుకున్న హార్దిక్.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
ఉదయపూర్‌లో ప్రేమికుల రోజున హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తన భార్య నటాషా స్టాంకోవిచ్‌ని మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. వీరికి సంబంధించిన చాలా ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉదయపూర్‌లో వీరు మరోసారి వివాహం చేసుకున్నారు.
- Author : Gopichand
Date : 15-02-2023 - 7:25 IST
Published By : Hashtagu Telugu Desk
ఉదయపూర్‌లో ప్రేమికుల రోజున హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తన భార్య నటాషా స్టాంకోవిచ్‌ని మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. వీరికి సంబంధించిన చాలా ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉదయపూర్‌లో వీరు మరోసారి వివాహం చేసుకున్నారు. పెళ్లి ఫోటోలను హార్దిక్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. ఇందులో జంట తెలుపు, నలుపు దుస్తులలో కనిపించింది. నటాషా తన పెళ్లిలో అందమైన తెల్లని గౌను ధరించింది. అయితే ఈ చిత్రాలలో హార్దిక్ నల్లటి సూట్‌లో కనిపించాడు. ఇందులో ఎప్పటిలాగే డాషింగ్‌గా కనిపించాడు.
Also Read: Valentines Day: ముద్దు పెట్టుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు.. ఫొటోలు వైరల్..!
దంపతులు తమ కొడుకుపై ప్రేమను కురిపించారు. అభిమానులు ఆ ఫోటోలను విపరీతంగా ఆదరిస్తున్నారు. పెళ్లి ఫోటోలను పంచుకుంటూ హార్దిక్ క్యాప్షన్‌లో ఇలా వ్రాశాడు. ‘మూడేళ్ల క్రితం మేము తీసుకున్న ప్రతిజ్ఞలను ఈ ప్రేమికుల రోజున మళ్లీ పునరావృతం చేసాము. ఈ వేడుకలో స్నేహితులు, కుటుంబ సభ్యుల ప్రేమను కలిగి ఉన్నందుకు సంతోషంగా ఉందని రాశాడు. నటాషా, హార్దిక్ రెండవసారి వివాహం చేసుకున్నారు. దీనికి ముందు ఈ జంట కోర్టులో వివాహం చేసుకున్నారు.