Ambani’s Wedding: అంబానీ పెళ్లి వేడుకలో హార్దిక్ దే హవా
అనంత్ అంబానీ,రాధిక మర్చంట్ వివాహ వేడుకలో టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా డ్యాన్స్ ఇరగదీశాడు.బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేతో కలసి హార్దిక్ మాస్ డ్యాన్స్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డీజే సౌండ్ కు వాళ్లిద్దరూ రెచ్చిపోయి స్టెప్పులు వేశారు
- By Praveen Aluthuru Published Date - 01:47 PM, Sat - 13 July 24

Ambani’s Wedding: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ఓ ఇంటివాడయ్యాడు.ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన అనంత్ అంబానీ,రాధిక మర్చంట్ వివాహ వేడుకలో టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా డ్యాన్స్ ఇరగదీశాడు. షారూఖ్ ఖాన్ పాపులర్ సాంగ్ గోరీ గోరీ పాటకు పాండ్య చిందులేశాడు. వాస్తవానికి ఈ వివాహ వేడుకకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, మహేంద్ర సింగ్ ధోని, శిఖర్ ధవన్ తదితరులు హాజరయ్యారు. అయితే అందరిలో హార్దిక్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచాడు.
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేతో కలసి హార్దిక్ మాస్ డ్యాన్స్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డీజే సౌండ్ కు వాళ్లిద్దరూ రెచ్చిపోయి స్టెప్పులు వేశారు. బీట్స్‌కు తగ్గట్లు హ్యాండ్ మూమెంట్స్ ఇస్తూ హార్దిక్ తనలోని డ్యాన్సింగ్ టాలెంట్‌ను చూపించాడు. హార్దిక్-అనన్య డ్యాన్స్‌ను చూసి ఇతర ప్రముఖులు కూడా స్టెప్పులెయ్యకుండా ఉండలేకపోయారు. అయితే హార్దిక్ బయటకు సరదాగా కనిపించినప్పటికీ లోపల ఎంత బాధపడుతున్నాడో ఇటీవల చూశాం.
https://x.com/i/status/1811778890341261393
టి-20 ప్రపంచకప్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఓ వైపు గెలిచిన ఆనందం, మరోవైపు ఒంటరి వాడినయ్యానన్న బాధ అతనిలో కనిపించింది. వాస్తవానికి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి చాలా కాలంగా వార్తల్లో నిలుస్తున్నాడు. అతని భార్య నటాషా స్టాంకోవిక్ హార్దిక్ కు విడాకులు ఇస్తున్నట్లు వార్తలు పుకార్లుగా వినిపించాయి. అయితే అది నిజమేనని స్పష్టమైంది. ప్రపంచకప్ గెలిచిన సమయంలో అందరూ తమ భార్యలతో సరదాగా గడిపితే హార్దిక్ మాత్రం త్రివర్ణ పథకంతో మైదానంలో తిరుగుతూ కనిపించాడు. ఆ తర్వాత కూడా అతని భార్య సోషల్ మీడియాలో ఎలాంటి విశేష్ చెప్పలేదు. దీంతో హార్దిక్ ని చూసి ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అయ్యారు. కష్టకాలంలో హార్దిక్ కి తోడుగా ఉన్నారు. తనని ట్రోల్ చేసిన వాళ్లే ఇప్పుడు హార్దిక్ హీరో అంటూ పోగుతుండటం గమనార్హం.
Also Read: Traffic Marshals: ఐటీ కారిడార్‌తో పాటు పలుచోట్ల ట్రాఫిక్ మార్షల్స్