Pandya On Kohli: ఆ షాట్లు కోహ్లీకే సాధ్యం…పాండ్యా ప్రశంసలు
భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఎంత ఉత్కంఠభరితంగా సాగిందో అభిమానులకు గుర్తు చేయనవసరం లేదు.
- By Naresh Kumar Published Date - 03:17 PM, Mon - 24 October 22

భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఎంత ఉత్కంఠభరితంగా సాగిందో అభిమానులకు గుర్తు చేయనవసరం లేదు. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా పార్టనర్ షిప్ మ్యాచ్ ను మలుపు తిప్పింది. ఓటమి ఖాయమనుకున్న దశలో ఇండియాను గెలిపించిన వీరిద్దరూ ఆడిన తీరుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్యూలో వీరిద్దరూ పాక్ తో మ్యాచ్ లో తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా కోహ్లీపై పాండ్యా ప్రశంసలు కురిపించాడు.
ముఖ్యంగా రవూఫ్ ఓవర్ లో కోహ్లీ కొట్టిన రెండు సిక్సర్లు అద్భుతమని వ్యాఖ్యానించాడు. విరాట్ కోహ్లి కొట్టిన ఆ రెండు షాట్లు ఎంత ముఖ్యమైనవో తనరు బాగా తెలుసన్న పాండ్యా ఒకవేళ ఒక్క షాట్ మిస్ చేసినా.. వాళ్లు ఒత్తిడి పెంచేవాళ్లని విశ్లేషించించాడు. తాను కూడా చాలా సిక్సర్లు కొట్టానని, అయితే కోహ్లీ కొట్టిన ఆ రెండు సిక్సర్లు మాత్రం ఎంతో ప్రత్యేకమైనవన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇలాంటి షాట్లుమిస్టర్ కోహ్లి తప్ప ఇంకెవరూ కొట్టలేరన్నాడు. పాక్ మ్యాచ్ లో తాను కూడా ఒత్తిడికి లోనయ్యానని గుర్తు చేసుకున్నాడు. ప్రతికూల పరిస్థితుల్లో ఆడగలిగానంటే అది సహచరుల సపోర్ట్ వల్లనే అని పాండ్యా చెప్పుకొచ్చాడు.
Of special knocks, game-changing sixes & thrilling victory at the MCG! 👌 💪
𝗦𝗽𝗲𝗰𝗶𝗮𝗹: Men of the moment – @imVkohli & @hardikpandya7 – chat after #TeamIndia beat Pakistan in the #T20WorldCup. 👏 👏 – By @RajalArora
Full interview 🎥 🔽 #INDvPAKhttps://t.co/3QKftWa7dk pic.twitter.com/sK7TyLFcSI
— BCCI (@BCCI) October 24, 2022