HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Sports
  • >Harbhajan Singh Angry On Slapgate Video With Sreesanth

Harbhajan Singh: లలిత్ మోదీపై హర్భజన్ సింగ్ ఆగ్రహం.. కార‌ణ‌మిదే?

శ్రీశాంత్ భార్య భువనేశ్వరి కుమారి కూడా వీడియోను షేర్ చేసినందుకు లలిత్ మోదీని విమర్శించారు. 'లలిత్ మోదీ, మైఖేల్ క్లార్క్‌లు సిగ్గుపడాలి' అని ఆమె అన్నారు.

  • By Gopichand Published Date - 08:55 PM, Mon - 1 September 25
  • daily-hunt
Harbhajan Singh
Harbhajan Singh

Harbhajan Singh: ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్‌తో కలిసి ఒక పోడ్‌కాస్ట్ చేశారు. ఈ షోలో లలిత్ మోదీ ఒక వీడియోను పంచుకున్నారు. దీంతో హర్భజన్ సింగ్ (Harbhajan Singh) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియోను షేర్ చేసినందుకు భజ్జీ లలిత్ మోదీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వీడియో ఐపీఎల్ 2008లో హర్భజన్ సింగ్, శ్రీశాంత్‌ల మధ్య జరిగిన ‘చెంపదెబ్బ సంఘటన’కు సంబంధించినది. ఈ సంఘటన జరిగి 18 సంవత్సరాలు గడిచిపోయినా ఈ క్లిప్ మొదటిసారిగా ప్రజల ముందుకు వచ్చింది.

హర్భజన్ సింగ్ ఆగ్రహం

మాజీ భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేసినందుకు లలిత్ మోదీని తీవ్రంగా విమర్శించారు. ఇన్స్టంట్ బాలీవుడ్‌తో మాట్లాడుతూ హర్భజన్.. ‘ఈ వీడియో బయటకు రావడం తప్పు’ అని అన్నారు. ఈ వీడియోను షేర్ చేయడం వెనుక లలిత్ మోదీకి ఏదైనా స్వార్థం ఉండవచ్చని కూడా భజ్జీ ఆరోపించారు. ’18 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటనను ప్రజలు మరచిపోయారు. కానీ ఇప్పుడు మళ్ళీ దానిని గుర్తు చేస్తున్నారు’ అని హర్భజన్ అన్నారు. తాను చేసిన పనికి పశ్చాత్తాపపడుతున్నానని, ఆ సంఘటనకు ఇప్పటికీ సిగ్గుపడుతున్నానని హర్భజన్ తెలిపారు.

Also Read: Sanju Samson: రాజస్థాన్ రాయల్స్‌తో విభేదాలు.. ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి సంజూ?

శ్రీశాంత్‌ను కొట్టిన హర్భజన్ సింగ్

ఐపీఎల్ 2008లో హర్భజన్ సింగ్ ముంబై ఇండియన్స్ తరపున, శ్రీశాంత్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ఆడేవారు. ఐపీఎల్ మొదటి సీజన్‌లో ముంబై, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత హర్భజన్ శ్రీశాంత్‌పై చెయ్యి చేసుకున్నారు. ఈ సంఘటన మ్యాచ్ తర్వాత జరిగింది. దీని వీడియో రికార్డ్ కాలేదు. అయితే తమ సెక్యూరిటీ కెమెరాలో ఈ సంఘటన రికార్డ్ అయిందని లలిత్ మోదీ వీడియో షేర్ చేస్తూ తెలిపారు.

శ్రీశాంత్ భార్య ఆగ్రహం

శ్రీశాంత్ భార్య భువనేశ్వరి కుమారి కూడా వీడియోను షేర్ చేసినందుకు లలిత్ మోదీని విమర్శించారు. ‘లలిత్ మోదీ, మైఖేల్ క్లార్క్‌లు సిగ్గుపడాలి’ అని ఆమె అన్నారు. ‘హర్భజన్, శ్రీశాంత్‌లు ఇద్దరూ ఈ సంఘటన తర్వాత ముందుకు వెళ్లిపోయారు. వాళ్లిద్దరూ ఇప్పుడు పాఠశాలకు వెళ్లే పిల్లలకు తండ్రులు, అయినా మీరు పాత గాయాలను మళ్లీ రేపుతున్నారు’ అని ఆమె అన్నారు. ‘ఇది చాలా అసహ్యకరమైన, క్రూరమైన, అమానవీయమైన చర్య’ అని శ్రీశాంత్ భార్య పేర్కొన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • harbhajan singh
  • Lalit Modi
  • slapgate
  • sports news
  • sreesanth
  • viral video

Related News

Amit Mishra

Amit Mishra: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మ‌రో టీమిండియా క్రికెట‌ర్‌!

ఏఎన్ఐతో మాట్లాడిన అమిత్ మిశ్రా.. "నా కెరీర్‌లో నేను అరంగేట్రం చేసిన తర్వాత ఐదేళ్ల గ్యాప్ వచ్చింది. నాకు ఈ ఒక్క విషయంపై మాత్రమే బాధ ఉంది" అని అన్నారు.

  • BCCI Sponsorship

    BCCI Sponsorship: స్పాన్సర్‌షిప్ బేస్ ధరను పెంచిన బీసీసీఐ..!

  • Teacher's speech at school...sleeping in the classroom under the influence of alcohol

    Viral Video : పాఠశాలలో టీచర్‌ నిర్వాకం..మద్యం మత్తులో క్లాస్ రూంలోనే నిద్ర

  • BCCI President

    BCCI President: బీసీసీఐకి కొత్త అధ్య‌క్షుడు.. రేసులో ఉన్న‌ది వీరేనా?

  • Cricketers Retired

    Cricketers Retired: 2025లో ఇప్ప‌టివ‌రకు 19 మంది స్టార్ క్రికెట‌ర్లు రిటైర్మెంట్‌!

Latest News

  • Wonderful : 5.2 కేజీలతో బాలభీముడు పుట్టాడు..ఎక్కడో తెలుసా..?

  • Trump : జపాన్ పై సుంకం 25 నుంచి 15 శాతానికి తగ్గింపు

  • Ajit Pawar : వివాదంలో అజిత్‌ పవార్‌.. మహిళా ఐపీఎస్ అధికారిణిపై అనుచిత వ్యాఖ్యలు

  • DJ Sound : DJ సౌండ్ తో ప్రాణాలు పోతాయా?

  • Accident : శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది మృతి

Trending News

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    • Raja Singh : పోలీసుల ఆంక్షలపై రాజాసింగ్ అభ్యంతరం..హిందూ పండుగలను నియంత్రించే హక్కు మీకెక్కడిది? !

    • GST Rates: జీఎస్టీ 2.0.. ఏయే వ‌స్తువులు త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd