IPL 2022 : అరంగేట్రంలో అదరగొట్టేది ఎవరో ?
ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా కొత్తగా ఈ మెగా టోర్నీలోకి అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జేయింట్స్ జట్లు తలపడనున్నాయి. \
- By Hashtag U Published Date - 05:26 PM, Mon - 28 March 22

ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా కొత్తగా ఈ మెగా టోర్నీలోకి అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జేయింట్స్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా ఇవాళ రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్‌గా ఉండగా, గెలుపు బోణీ ల్ కోసం ఇరు జట్లు తహతహలాడుతున్నాయి. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో తొలుత గుజరాత్ టైటాన్స్ బలాబలాలను పరిశీలిస్తే… ఆటగాళ్ల రిటెన్షన్‌లో హార్దిక్ పాండ్యా, శుబ్ మాన్ గిల్, రషీద్ ఖాన్ ను దక్కించుకున్న గుజరాత్ టీమ్.. మెగా వేలంలో గుర్ కీరత్ సింగ్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్,
రాహుల్ తెవాతియా ,మహ్మద్ షమీ, యశ్ దయాల్ , ఆర్ సాయ్ కిషోర్ , డేవిడ్ మిల్లర్, అభినవ్ సదరంగని, మాథ్యూ వేడ్, అల్జరీ జోసఫ్, వృద్ధిమాన్ సాహా, జయంత్ యాదవ్ లాంటి ఆటగాళ్లను సొంతం చేసుకుంది.
మరోవైపు లక్నో సూపర్ జేయింట్స్ జట్టును చూస్తే కేఎల్ రాహుల్ నేతృత్వంలో ఆ జట్టు మ్యాచ్ విన్నర్లతో ఉరకలేస్తుంది. తొలిసారి టైటిల్ గెలవాలని ఉవ్విళ్లూరుతున్న లక్నో జట్టు అందుకు అనుగుణంగానే మెగా వేలం ముంగిట కేఎల్ రాహుల్‌తో పాటు స్టార్ ఆల్ రౌండర్ మార్క్ స్టోయినిస్, యువ స్పిన్నర్ రవి బిష్ణోయిలను రిటైన్ చేసుకుంది. ఇక మెగావేలంలో భారీ మొత్తం వెచ్చించి మరీ లక్నో సూపర్ జాయింట్స్ ఫ్రాంచైజీ యువ పేసర్ ఆవేశ్ ఖాన్, విండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ భారత్ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యాను కొనుగోలు చేసింది. వీరితో పాటు దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటాన్ డికాక్, టీమిండియా ఆల్ రౌండర్ దీపక్ హుడాలను కూడా దక్కించుకుంది. ఇక ఈ మ్యాచ్ జరగనున్న వాంఖడే పిచ్ బ్యాటింగ్ కు స్వర్గధామం అని చెప్పొచ్చు. ఈ క్రమంలో టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.