HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Good News For Sunrisers Pat Cummins Is Arriving

SRH: సన్‌రైజర్స్‌కు గుడ్ న్యూస్.. ప్యాట్ కమిన్స్ వచ్చేస్తున్నాడు!

  • Author : Vamsi Chowdary Korata Date : 16-04-2026 - 12:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
SRH captain Pat Cummins is back
SRH captain Pat Cummins is back

Pat Cummins ఐపీఎల్ 2026 సీజన్‌లో మిశ్రమ ఫలితాలతో కొనసాగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) జట్టుకు భారీ శుభవార్త అందింది. జట్టు నియమిత కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ప్యాట్ కమిన్స్ గాయం నుంచి పూర్తిగా కోలుకుని ఫిట్‌నెస్ సాధించాడు. రెండు రోజుల్లో అతను తిరిగి జట్టుతో కలవనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 25న జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్ ద్వారా కమిన్స్ మైదానంలోకి తిరిగి అడుగుపెట్టే అవకాశం ఉంది.

సీజన్ ప్రారంభానికి ముందే భారత్‌కు చేరుకున్న కమిన్స్, వెన్నుొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఈ నెల 2న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం అతడు ప్రత్యేక స్కానింగ్ కోసం ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లాడు. ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో కథనం ప్రకారం సిడ్నీలో నిర్వహించిన స్కానింగ్‌లో గాయం పూర్తిగా నయమైనట్లు నిర్ధారణ అయింది. దీంతో అతను తిరిగి భారత్‌కు బయల్దేరుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా సూచన ఇచ్చాడు. కమిన్స్ రాకతో సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగంతో పాటు కెప్టెన్సీ కూడా మరింత బలోపేతం కానుంది.

ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన యాషెస్ సిరీస్ తర్వాత కమిన్స్ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇటీవల ముగిసిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026కు కూడా అతను దూరమయ్యాడు. ఇక, కమిన్స్ జట్టుకు దూరం కావడంతో ఇషాన్ కిషన్ జట్టుకు సారథ్యం వహించాడు. అతని నాయకత్వంలో ఎస్‌ఆర్‌హెచ్ ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో రెండింటిలో గెలిచింది.

సోమవారం జరిగిన మ్యాచ్‌లో అరంగేట్ర బౌలర్లు ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ చెరో నాలుగు వికెట్లతో చెలరేగడంతో టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శనివారం తమ హోమ్ గ్రౌండ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ తలపడనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • captain pat cummins
  • cricket news
  • IPL 2026
  • ishan kishan
  • Sunrisers Hyderabad
  • Sunrisers Hyderabad (SRH)

Related News

    Latest News

    • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

    • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

    • Cm Vijay: కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం

    • Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

    • Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్ర‌బాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd