HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Good News For Srh Fans

SRH: ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..

  • Author : Vamsi Chowdary Korata Date : 28-03-2026 - 11:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pat Cummins Back To Srh
Pat Cummins Back To Srh

Pat Cummins సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బిగ్ అప్‌డేట్ అందింది. ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఎప్పుడు టీమ్‌లోకి వచ్చే విషయాన్ని కోచ్ డేనియల్ వెటోరీ తెలిపాడు. గాయం కారణంగా చాలా కాలం పాటు క్రికెట్‌కు దూరమైన కమిన్స్.. ప్రస్తుతానికి ఫిట్‌గానే ఉన్నప్పటికీ, బౌలింగ్ లోడ్స్ పెంచే విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్నాడని తెలుస్తోంది. క్రికెట్ ఆస్ట్రేలియా ఫిట్‌నెస్‌కు సంబంధించి ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదని, మరో పది నుంచి 12 రోజుల్లో జట్టుతో జాయిన్ అయ్యే అవకాశం ఉందని వెటోరీ చెప్పాడు.

ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఒక కీలక అప్‌డేట్ వచ్చింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆరంభ మ్యాచ్‌కి ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కోచ్ డేనియల్ వెటోరీ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఫిట్‌నెస్‌పై క్లారిటీ ఇచ్చాడు. కమిన్స్ ఐపీఎల్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది, క్రికెట్ ఆస్ట్రేలియా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చిందా లేదా అన్న వివరాలు వెల్లడించాడు.

కమిన్స్ ఫిట్‌నెస్‌ బాగానే ఉన్నప్పటికీ, బౌలింగ్‌లో ఫిట్‌ అవ్వడానికి ఇంకాస్త సమయం పడుతుందని వెటోరీ తెలిపాడు. క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి ఇప్పటి వరకు కమిన్స్ పూర్తి ఫిట్‌గా ఉన్నాడనే క్లియరెన్స్ మాత్రం రాలేదు. వెటోరీ అంచనా ప్రకారం మరో 10 నుంచి 12 రోజుల్లో కమిన్స్ కమ్ బ్యాక్ ఇస్తాడని అర్థమవుతోంది.

కమిన్స్ ఫిట్‌నెస్ విషయంలో పెద్దగా సమస్య లేదు. చాలా కాలం ఆటకు దూరంగా ఉండటం వల్ల స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్స్‌పై ఎక్కువగా పని చేశాడు. ఇక్కడ అసలు సవాలు బౌలింగ్ లోడ్స్‌ను పెంచడంలోనే ఉంది. తిరిగి బౌలింగ్ లోడ్స్‌ను పెంచడం చాలా కష్టమైన ప్రక్రియ. శరీరం పూర్తిగా ఫిట్ అవ్వడానికి ఇంకాస్త సమయం పడుతుంది అని వెటోరీ చెప్పాడు.

కమిన్స్ దూరమవ్వడంతో ఇషాన్ కిషన్‌కు కెప్టెన్సీ అప్పగించామని.. సారథ్య బాధ్యతలు తీసుకోవడంలో ఇషాన్ చాలా ఎగ్జయిట్‌గా ఉన్నాడని వెటోరీ తెలిపాడు. ఇషాన్ కిషన్‌పై నమ్మకం ఉందని.. అదేవిధంగా కమిన్స్ లేకపోయినా జట్టులో అందుకు తగ్గ రీప్లేస్‌మెంట్‌లు ఉన్నాయంటూ వెటోరీ వివరించాడు. కమిన్స్ గ్రౌండ్‌లోకి రాకపోయినా.. ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తాడని క్లారిటీ ఇచ్చాడు.

ఇక ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటల నుంచి ప్రారంభం కానుంది. కమిన్స్ లేకపోయినా మ్యాచ్ గెలిచి జట్టులో కాన్ఫిడెన్స్ నింపాలని కెప్టెన్ ఇషాన్‌తో పాటు కోచ్ వెటోరీ గట్టి పట్టుదలతో ఉన్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • captain pat cummins
  • cricket news
  • Daniel Vettori
  • IPL 2026
  • pat cummins
  • SRH
  • sunriser hyderabad

Related News

Vaibhav Suryavanshi to make his debut in the second T20 between India and England today!

vaibhav suryavanshi: నేడు భారత్-ఇంగ్లాండ్ రెండో టీ20లో.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.!

ఇంగ్లండ్‌తో ఇవాళ జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరఫున అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘కొత్త అధ్యాయం’ అనే క్యాప్షన్‌తో అతను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక స్టోరీ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. యూకే పర్యటనలో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20లు, ఇంగ్లండ్‌తో వర్షం కారణంగా రద్దయిన తొలి టీ20లోనూ వైభవ్ బెంచ్‌కే పరి

  • India vs. Sri Lanka Test series schedule...

    IND vs SL: ఇండియా, శ్రీలంక టెస్ట్ సిరీస్ షెడ్యూల్..

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd