Gautam Gambhir: సింగపూర్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న గౌతమ్ గంభీర్
- Author : Vamsi Chowdary Korata
Date : 25-03-2026 - 2:48 IST
Published By : Hashtagu Telugu Desk
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రస్తుతం కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్నాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2026లో భారత్‌కు చారిత్రక విజయాన్ని అందించిన తర్వాత గౌతీ విరామం తీసుకున్నాడు. సింగపూర్‌లో తన భార్య నటాషా, కుమార్తెలు అజీన్, అనైజాతో కలిసి వెకేషన్‌ను ఆస్వాదిస్తున్నాడు.
సింగపూర్ వీధుల్లో సాధారణ దుస్తుల్లో కనిపించిన గంభీర్, తన చిన్న కుమార్తెను భుజాలపై ఎక్కించుకుని నడుస్తూ కనిపించాడు.
2007లో టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న గంభీర్, ఇప్పుడు కోచ్‌గానూ కప్ సాధించి అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. రాహుల్ ద్రవిడ్, లాల్‌చంద్ రాజ్‌పుత్ తర్వాత ఈ ఘనత సాధించిన కోచ్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఛాంపియన్‌గా నిలిపిన తర్వాతే గౌతీ భారత జట్టు హెడ్ కోచ్‌గా నియమితులయ్యాడు.
ఇక, టీమిండియా తదుపరి సిరీస్ జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనుంది. ఈ పర్యటనలో ఒక టెస్ట్, మూడు వన్డేలు ఆడనుంది. ఆ తర్వాత ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు వెళ్లనుంది.