Former Cricketer Abdul Azeem: ప్రముఖ మాజీ క్రికెటర్ అబ్దుల్ అజీమ్ కన్నుమూత
హైదరాబాద్ మాజీ క్రికెటర్ అబ్దుల్ అజీమ్ (Former Cricketer Abdul Azeem) మంగళవారం మృతి చెందాడు. అజీమ్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
- Author : Gopichand
Date : 19-04-2023 - 7:56 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్ మాజీ క్రికెటర్ అబ్దుల్ అజీమ్ (Former Cricketer Abdul Azeem) మంగళవారం మృతి చెందాడు. అజీమ్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో దూకుడుగా ఆడే ఓపెనర్‌గా అజీమ్ పేరు గడించాడు. 1986 రంజీ సీజన్‌లో తమిళనాడుపై ట్రిపుల్ సెంచరీ కూడా సాధించాడు. 1980-85 మధ్య 73 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. కోచ్‌గా, హెచ్‌సీఏ సెలెక్టర్‌గా కూడా సేవలందించాడు. అజీమ్ మృతికి హెచ్‌సీఏ అడ్మినిస్ట్రేటర్, మాజీ జస్టిస్ లావు నాగేశ్వరరావు సంతాపం తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
క్రికెట్ కుటుంబంలో జన్మించిన అతని ఎనిమిది మంది సోదరులలో నలుగురు క్రికెట్ ఆడారు. అయితే అజీమ్, అబ్దుల్ జబ్బార్ దేశానికి ఆడకపోవడం దురదృష్టకరం అయినప్పటికీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు. 1980లో ఫస్ట్ క్లాస్‌లో అరంగేట్రం చేసిన అజీమ్ 73 మ్యాచ్‌లు ఆడాడు. జింఖానా మైదానంలో తమిళనాడుపై ట్రిపుల్ సెంచరీతో సహా 12 సెంచరీలతో 4,644 పరుగులు చేశాడు. ఏది ఏమైనప్పటికీ 1986-87లో ఢిల్లీతో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్‌లో హైదరాబాద్ ఛాంపియన్‌గా అవతరించినప్పుడు ఢిల్లీకి వ్యతిరేకంగా ఫిరోజ్ షా కోట్లా మైదానంలో గ్రీన్ వికెట్‌పై అత్యుత్తమ ఆట తీరు కనబరిచాడు.
Also Read: Ram Charan: ఐపీఎల్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఎంట్రీ ఇవ్వబోతున్న రాంచరణ్
అజీమ్ మృతి పట్ల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ప్రస్తుత అడ్మినిస్ట్రేటర్, సుప్రీం కోర్టు రిటైర్డ్ జస్టిస్ నాగేశ్వర్‌రావుతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు సంతాపం తెలిపారు. బుధవారం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 1986లో తమిళనాడుతో జరిగిన రంజీ మ్యాచ్‌లో అజీమ్ ట్రిపుల్ సెంచరీ సాధించారు. 1980 నుంచి 1995 వరకు క్రికెట్ కెరీర్ కొనసాగించిన ఆయన 73 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడి 4644 పరుగులు చేశాడు. ఇందులో 12 శతకాలున్నాయి.అజీమ్ హైదరాబాద్ జట్టు కోచ్ గా, సెలక్టర్ గా కూడా సేవలు అందించారు.