IPL 2022 : బెంగళూర్ బోణీ కొట్టేనా ?
ఐపీఎల్ లో ఇవాళ కోల్ కత్తా నైట్ రైడర్స్ , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు పోటీపడనున్నాయి. డివై పాటిల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో కేకేఆర్ తాము ఆడిన తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై 4 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది.
- By Naresh Kumar Published Date - 12:48 PM, Wed - 30 March 22

ఐపీఎల్ లో ఇవాళ కోల్ కత్తా నైట్ రైడర్స్ , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు పోటీపడనున్నాయి. డివై పాటిల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో కేకేఆర్ తాము ఆడిన తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై 4 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది.. ఇందులో తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. అనంతరం 132 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇక మరోవైపు ఈ సీజన్ లో తాము ఆడిన తొలి మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమిపాలైంది.. ఈ మ్యాచ్ లో తొలుత ఆర్సీబీ 205 పరుగులు చేయగా.. అనంతరం 19 ఓవర్లలోనే పంజాబ్ 208 పరుగులు చేసి విజయం సాధించింది…
ఇక రెండు జట్ల మధ్య హెడ్ టుహెడ్ రికార్డుల ను పరిశీలిస్తే.. ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు మొత్తం 29 మ్యాచ్‌ల్లో తలపడగా కేకేఆర్ 16 మ్యాచుల్లో, ఆర్సీబీ 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఇక ఈ మ్యాచ్ లో ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తుది జట్టుని పరిశీలిస్తే.. ఫాఫ్ డు ప్లెసిస్ , అనుజ్ రావత్ ఓపెనర్లుగా రానుండగా.. మూడో స్థానంలో ,విరాట్ కోహ్లి, మిడిల్ ఆర్డర్ లో దినేష్ కార్తీక్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ లోయర్ ఆర్డర్ లో షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా బ్యాటింగ్ కు రానున్నారు.. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ విషయానికొస్తే..డేవిడ్ విల్లీ, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్ దుమ్మురేపేందుకు సిద్ధంగా ఉన్నారు.. అలాగే ఈ మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ లోని కేకేఆర్ తుది జట్టుని పరిశీలిస్తే.. వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే ఓపెనర్లుగా రానుండగా .. మూడో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ ,మిడిల్ ఆర్డర్ లో నితీష్ రాణా, సామ్ బిల్లింగ్స్ లోయర్ ఆర్డర్ లో ఆండ్రీ రస్సెల్,, షెల్డన్ జాక్సన్ బ్యాటింగ్ కు రానున్నారు..
ఇక కేకేఆర్ బౌలింగ్ విభాగం విషయానికొస్తే.. సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, శివం మావి, వరుణ్ చక్రవర్తి అదరగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు…..అలాగే ఈ మ్యాచ్ జరగనున్న డివై పాటిల్ స్టేడియం పిచ్ బ్యాటింగ్ వికెట్. పిచ్ పై బౌన్స్ ఎక్కువగా ఉండటంతో మ్యాచ్ ఆరంభంలో బౌలర్లు చెలరేగే అవకాశం ఉంది. అయితే బంతి పాత పడ్డాక బాల్ నేరుగా బ్యాట్ పైకి వస్తుంది. 160-170 పరుగులు చేసే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.