Zaheer Khan: టీమిండియా ప్రధాన కోచ్ గంభీర్‌ను హెచ్చరించిన జహీర్ ఖాన్
గౌతమ్ గంభీర్ టీమిండియా బ్యాటింగ్ ఫార్మేట్ పై ఫ్లెక్సిబిలిటీ కోరుకుంటున్నాడు. ఓపెనర్లు తప్ప మిగతా బ్యాట్స్‌మెన్లు అందరూ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు.
- By Gopichand Published Date - 05:20 PM, Tue - 11 February 25

Zaheer Khan: ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ గౌతం గంభీర్ జోడీ పరాజయం పాలైంది. వీరిద్దరి సారథ్యంలో ప్రస్తుతం జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్ తర్వాత ఇప్పుడు వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. అయితే దీని తర్వాత కూడా కోచ్ గంభీర్ వ్యూహంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ (Zaheer Khan) గంభీర్‌ను తీవ్రంగా విమర్శించాడు. జట్టులో ఫ్లెక్సిబిలిటీ బాగానే ఉందని, అయితే ఇది అభద్రతా భావాన్ని సృష్టిస్తోందని అన్నాడు.
గౌతమ్ గంభీర్ టీమిండియా బ్యాటింగ్ ఫార్మేట్ పై ఫ్లెక్సిబిలిటీ కోరుకుంటున్నాడు. ఓపెనర్లు తప్ప మిగతా బ్యాట్స్‌మెన్లు అందరూ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ జహీర్ ఖాన్ అతని వ్యూహాన్ని తప్పుబట్టాడు. జహీర్ ఖాన్ మాట్లాడుతూ ‘బ్యాటింగ్ ఆర్డర్‌లో ఫ్లెక్సిబిలిటీ కారణంగా ఆటగాళ్లు అభద్రతా భావానికి గురవుతున్నారు. జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో మీరు ఫ్లెక్సిబిలిటీని కోరుకుంటున్నారని, అయితే ఆ ఫ్లెక్సిబిలిటీలో కొన్ని నియమాలు కూడా వర్తిస్తాయి. వాటిని మీరు పాటించాల్సిన అవసరం ఉందని చెప్పాడు. జహీర్ ఖాన్ గౌతమ్ గంభీర్ వ్యూహాన్ని ప్రశ్నించడమే కాకుండా అతన్ని హెచ్చరించాడు.
Also Read: Tulsi: ఈ మొక్కలను తులసి మొక్క వద్ద ఉంచుతున్నారా.. అయితే ఆనందం ఆవిరైపోవడం ఖాయం!
మరోవైపు భారత జట్టు మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా గంభీర్ నిర్ణయాల్ని తప్పుబట్టాడు. కెఎల్ రాహుల్ బ్యాటింగ్ స్థానాన్ని మార్చడంతో జట్టు యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. 2023 ప్రపంచ కప్‌లో 5వ స్థానంలో కేఎల్ రాహుల్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. కానీ అప్పటి నుండి అతని బ్యాటింగ్ స్థానం మారుతూ వచ్చింది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో రాహుల్‌ను 6వ స్థానంలో పంపుతున్నారు. అక్షర్ స్థానంలో రాహుల్ ని పంపుతున్నారు. రాహుల్ ను 6 లేదా 7వ స్థానంలో బ్యాటింగ్ చేస్తే 6 లేదా 7 పరుగులు మాత్రమే చేస్తాడు. ఇది అన్యాయమని అన్నాడు శ్రీకాంత్. అక్షర్‌తో నాకు ఎటువంటి సమస్య లేదు, అతను తన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. అయితే రాహుల్ ఆత్మవిశ్వాసాన్ని ఎందుకు బలహీనపరచాలి? అతను ప్రపంచ క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన ఆటగాడని గుర్తు చేశాడు.