HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >England Complete Crucial Win Over New Zealand

England vs New Zealand: గెలిచారు.. నిలిచారు.. కివీస్ పై ఇంగ్లాండ్ విక్టరీ..!

టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీస్ రేసు మ్యాచ్ మ్యాచ్ కూ రసవత్తరంగా మారుతోంది.

  • Author : Gopichand Date : 01-11-2022 - 5:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cropped (2)
Cropped (2)

టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీస్ రేసు మ్యాచ్ మ్యాచ్ కూ రసవత్తరంగా మారుతోంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ న్యూజిలాండ్ పై విజయం సాధించింది. తద్వారా సెమీఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంచుకుంది. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో ఇంగ్లాండ్ 20 రన్స్ తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ 179 పరుగుల స్కోరు సాధించింది.

ఓపెనర్లు బట్లర్‌, హేల్స్‌ హాఫ్‌ సెంచరీలతో చెలరేగడంతో న్యూజిలాండ్ ముందు మంచి టార్గెట్ ఉంచింది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన బట్లర్ 47 బంతుల్లో 73 రన్స్‌ చేయగా.. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. అటు అలెక్స్‌ హేల్స్‌ 40 బాల్స్‌లో 52 రన్స్‌ చేశాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 10.2 ఓవర్లలోనే 81 పరుగుల పార్టనర్ షిప్ అందించారు. వీరిద్దరూ తప్ప మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. మిడిలార్డర్‌లో లియామ్‌ లివింగ్‌స్టోన్‌ మాత్రమే రాణించాడు.

180 పరుగుల లక్ష్య చేదనలో న్యూజిలాండ్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ , గ్లెన్‌ ఫిలిప్స్‌ పోరాడడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ఇద్దరూ మూడో వికెట్‌కు 91 రన్స్‌ జోడించి విజయంపై ఆశలు రేపారు. అయితే కీలకమైన సమయంలో ఈ ఇద్దరూ ఔటవడంతో న్యూజిలాండ్‌కు ఓటమి తప్పలేదు. చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లాండ్ విజయాన్ని అందుకుంది. విలియమ్సన్‌ 40 , గ్లెన్‌ ఫిలిప్స్‌ 62 రన్స్ చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 2 , సామ్ కరన్ 2 వికెట్లు పడగొట్టారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • England vs New Zealand
  • england wins
  • ICC T20 world cup
  • New Zealand
  • T20 world cup

Related News

    Latest News

    • SRH: ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..

    • Professor Harassment : విద్యార్థికి అర్దరాత్రి ప్రొఫెసర్ ఫోన్ చేసి ఇన్నర్వేర్ గురించి అసభ్య ప్రశ్నలు

    • Gumma Thanuja Rani: కోవూరు అభివృద్ధికి అరకు ఎంపీ నిధులు కేటాయింపు

    • Gold Price Hike : బంగారం కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూస్..భారీగా పెరిగిన బంగారం ధర

    • Loan App Harassment: లోన్ యాప్ వేధింపులకు ఎంబీఏ విద్యార్థి బలి

    Trending News

      • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

      • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

      • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

      • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

      • Petrol ,Diesel Price Down : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గింపు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd