Asia Cup : ఆసియా కప్‌లో రెండో అత్యుత్తమ జట్టు ఏదో తెలుసా?
Asia Cup : ట్రై సిరీస్ గెలిచిన ఉత్సాహంలో ఉన్న పాకిస్థాన్ ఇప్పుడు ఆసియా కప్ 2025 కోసం సన్నద్ధమవుతోంది. అఫ్గానిస్తాన్, యూఏఈ, పాకిస్థాన్‌ల మధ్య జరిగిన
- By Kavya Krishna Published Date - 03:55 PM, Mon - 8 September 25

Asia Cup : ట్రై సిరీస్ గెలిచిన ఉత్సాహంలో ఉన్న పాకిస్థాన్ ఇప్పుడు ఆసియా కప్ 2025 కోసం సన్నద్ధమవుతోంది. అఫ్గానిస్తాన్, యూఏఈ, పాకిస్థాన్‌ల మధ్య జరిగిన ట్రై సిరీస్‌లో పాక్ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్‌లో పాకిస్థాన్ అఫ్గానిస్తాన్‌ను ఓడించింది. దీనికి బదులు తీర్చుకోవాలని అఫ్గానిస్తాన్ పట్టుదలతో ఉంది. అయితే, తమను ‘రెండో బెస్ట్’ టీమ్‌గా కూడా పరిగణించని వారికి తమ ఆటతోనే సమాధానం ఇవ్వాలని పాకిస్థాన్ కూడా చూస్తోంది. హాంగ్ కాంగ్, అఫ్గానిస్తాన్‌ల మధ్య సెప్టెంబర్ 9న జరిగే మ్యాచ్‌తో ఈ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది.
ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వింత ప్రశ్న
ట్రై సిరీస్ ప్రారంభానికి ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా పక్కనే ఉన్న అఫ్గానిస్తాన్ కెప్టెన్ రషీద్‌ను ఒక విలేకరి ‘ఆసియాలోనే రెండో అత్యుత్తమ జట్టు’గా ఉన్న మీరు మినీకప్‌కు ఎలా సిద్ధమయ్యారని అడిగాడు.ఈ ప్రశ్నతో సల్మాన్ అఘా చాలా ఇబ్బందిపడ్డాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. పాక్ ట్రై సిరీస్‌ను గెలిచినా అఫ్గానిస్తాన్ నుంచి పాకిస్థాన్‌కు ఇంకా ముప్పు ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. శ్రీలంక సైతం గట్టిగా ప్రయత్నిస్తోంది.
Jaipur : జైపూర్‌లోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. రంగంలోకి పోలీసు బృందాలు
స్టార్ ప్లేయర్స్ లేని లోటు..
సీనియర్ ఆటగాళ్లైన మహ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్ పాక్ క్రికెట్‌లో గత కొన్ని సంవత్సరాలుగా కీలక పాత్ర పోషించారు. ఇటీవల వారిద్దరూ ఫామ్‌లో లేకపోవడంతో జట్టులో చోటు కోల్పోయారు. ఈ స్టార్ ప్లేయర్లు లేకపోవడంతో పాకిస్థాన్ బలహీనపడినట్లు కనిపిస్తోంది. ట్రై సిరీస్ గెలిచిన ఉత్సాహంతోనే పాక్ ఆసియా కప్‌లో దిగుతోంది. గ్రూప్ దశలో భారత్‌తో తప్ప మిగతా జట్ల నుంచి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ సూపర్ 4లో అఫ్గానిస్తాన్, శ్రీలంక వంటి గట్టి జట్లు ఎదురవుతాయి.
చిన్న జట్ల నుంచి సంచలనాలు
టీ20 క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. గతంలోనూ చాలా సార్లు పెద్ద జట్లకు చిన్న జట్ల నుంచి షాక్‌లు తగిలాయి. ఈసారి కూడా అలాంటి సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది. భారత్, పాకిస్థాన్, యూఏఈలతోపాటు ఒమన్ కూడా గ్రూప్ దశలో తలపడనుంది. తమను తక్కువగా అంచనా వేయొద్దని, పెద్ద జట్లకు షాక్ ఇస్తామని ఒమన్ ప్లేయర్ సుఫ్యాన్ మెహమూద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. గతంలో చిన్న జట్టుగా పిలవబడిన అఫ్గానిస్తాన్ ఇప్పుడు అద్భుతమైన ఆటతో ఆకట్టుకుంటోంది. ఈ ఆసియా కప్‌లో కూడా యూఏఈ, ఒమన్‌లను తక్కువ అంచనా వేయొద్దని క్రికెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సంచలన ఫలితాలు ఖాయమని వారు చెబుతున్నారు.
YS Sharmila : నా కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడు : వైఎస్ షర్మిల