Air India Plane Crash: విమాన ప్రమాదంలో క్రికెటర్ దుర్మరణం.. ఆలస్యంగా వెలుగులోకి!
జూన్ 12న ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI 171 అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళుతుండగా టేకాఫ్ అయిన కేవలం 2 నిమిషాల్లోనే కూలిపోయింది. 241 మంది ప్రయాణికులలో దీర్ఘ్ పటేల్ అనే క్రికెటర్ కూడా ఉన్నాడు. అతను లీడ్స్ మోడర్నియన్స్ క్రికెట్ క్లబ్‌కు క్రికెట్ ఆడాడు.
- By Gopichand Published Date - 11:57 AM, Tue - 17 June 25

Air India Plane Crash: అహ్మదాబాద్‌లో జూన్ 12న జరిగిన విమాన ప్రమాదంలో (Air India Plane Crash) ఒక్కరు తప్ప మిగిలిన అందరు ప్రయాణికులు మరణించారు. ఈ సంఘటన దేశమంతటినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా మరణించారు. ఇప్పుడు వచ్చిన నివేదికల ప్రకారం.. ఈ విమాన ప్రమాదంలో 23 ఏళ్ల క్రికెటర్ దీర్ఘ్ పటేల్ కూడా మరణించాడు. అతను హడర్స్‌ఫీల్డ్ యూనివర్సిటీలో చదువుతున్నాడు.
ఫ్లైట్ AI 171లో ఉన్న క్రికెటర్
జూన్ 12న ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI 171 అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళుతుండగా టేకాఫ్ అయిన కేవలం 2 నిమిషాల్లోనే కూలిపోయింది. ఈ ఎయిర్ ఇండియా విమానం మెడికల్ స్టూడెంట్స్ హాస్టల్‌పై కూలిపోయింది. దీనిలో దాదాపు 30 మంది విద్యార్థులు, విమానంలో ఉన్న ఒక్క ప్రయాణికుడు తప్ప మిగిలిన అందరూ మరణించారు. ఈ 241 మంది ప్రయాణికులలో దీర్ఘ్ పటేల్ అనే క్రికెటర్ కూడా ఉన్నాడు. అతను లీడ్స్ మోడర్నియన్స్ క్రికెట్ క్లబ్‌కు క్రికెట్ ఆడాడు.
Also Read: ATMs : ఆర్‌బీఐ గడువుకు ముందే పురోగతి..ఏటీఎంల్లో పెరిగిన రూ.100, రూ.200 నోట్ల లభ్యత
Dirdh Patel, 23-Year-Old Cricketer, Among Those Who Died In Air India Plane Crash. Team Pays Emotional Tribute. 🙏🙏 pic.twitter.com/svKuooNbwt
— The Great India (@thegreatindiav) June 17, 2025
హడర్స్‌ఫీల్డ్ యూనివర్సిటీలోని ఒక ప్రొఫెసర్ ప్రకారం.. దీర్ఘ్ పటేల్ తన విద్యాసామర్థ్యం, ఉత్సాహం, అభిరుచికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి. అతను చదువులో ఎల్లప్పుడూ ఆసక్తిని చూపేవాడు. తరగతిలో అడిగే అతని ప్రశ్నలు అతని లోతైన అవగాహనను సూచించేవని తెలిపాడు.
2024లో దీర్ఘ్ పటేల్ లీడ్స్ మోడర్నియన్స్ క్లబ్‌కు విదేశీ ఆటగాడిగా క్రికెట్ ఆడాడు. అతని మరణ వార్త విని క్లబ్ చాలా బాధపడింది. ఈ విషయంపై ఎరెడేల్ & వార్ఫ్‌డేల్ సీనియర్ క్రికెట్ లీగ్ ప్రతినిధి మాట్లాడుతూ.. “గుజరాత్‌కు చెందిన దీర్ఘ్ పటేల్ తన కొత్త ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత క్రికెట్ ఆడటం కొనసాగించాలని భావించాడు” అని చెప్పారు. అతను 20 మ్యాచ్‌లలో ఫస్ట్ ఎలెవన్‌కు బ్యాటింగ్ చేస్తూ 312 పరుగులు సాధించాడు. బౌలింగ్‌లో 29 వికెట్లు తీసుకున్నాడు. పటేల్‌కు అతని ప్రొఫెసర్లు మరియు క్రికెట్ క్లబ్ తరపున శ్రద్ధాంజలి అర్పించారు.