HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Delhi Capitals Defeat Gujarat Giants By 10 Wickets

WPL 2023: 28 బంతుల్లో 76 పరుగులు.. ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం

మహిళల ప్రీమియర్ లీగ్‌ (Women's Premier League)లో గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) జట్టుపై ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో మెగ్ లానింగ్ జట్టు స్నేహ రాణా జట్టును సులభంగా ఓడించింది.

  • Author : Gopi Date : 12-03-2023 - 7:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
DC
Resizeimagesize (1280 X 720) (1) 11zon

మహిళల ప్రీమియర్ లీగ్‌ (Women’s Premier League)లో గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) జట్టుపై ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో మెగ్ లానింగ్ జట్టు స్నేహ రాణా జట్టును సులభంగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుజరాత్ జెయింట్స్ 106 పరుగుల విజయ లక్ష్యం ఉంచింది. ఈ మ్యాచ్‌లో మెగ్ లానింగ్ జట్టు కేవలం 7.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 107 పరుగులు చేసి విజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్ తో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ షెఫాలీ వర్మ సుడిగాలిలా విజృంభించింది. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున షెఫాలీ వర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. షెఫాలీ వర్మ 28 బంతుల్లో అజేయంగా 76 పరుగులు చేసింది. ఈ యువ బ్యాట్స్‌మెన్ తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు బాదింది.

షెఫాలీ వర్మతో పాటు కెప్టెన్ మెగ్ లానింగ్ 15 బంతుల్లో 21 పరుగులు చేసి నాటౌట్‌గా వెనుదిరిగింది. తన ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు కొట్టింది. ఇద్దరు ఓపెనర్ల అద్భుత ఇన్నింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 7.1 ఓవర్లలో 10 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది. అంతకుముందు గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ స్నేహ రాణా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 105 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ జెయింట్స్ తరఫున కిమ్ గార్త్ 37 బంతుల్లో అజేయంగా 32 పరుగులు చేసింది. జార్జియా వేర్‌హామ్, హర్లీన్ డియోల్ వరుసగా 22, 20 పరుగుల ఇన్నింగ్స్‌లు ఆడారు.

Also Read: Virat Kohli Record: విరాట్ ఎన్నాళ్ళకెన్నాళ్ళకు..

మెగ్ లానింగ్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు 4 మ్యాచ్‌ల్లో ఇది మూడో విజయం. అంతకుముందు ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. డబ్ల్యూపీఎల్ పాయింట్ల పట్టికలో ఢిల్లీ జట్టు ప్రస్తుతం రెండోస్థానంలో ఉంది. ఆదివారం యుపి వారియర్స్ జట్టు ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడనుంది. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • delhi capitals
  • gujarat giants
  • Shafali Verma
  • Women’s Premier League
  • WPL 2023

Related News

Rcb Green Jersey

IPL 2026 : ఈరోజు గ్రీన్ జెర్సీ తో ఆర్సీబీ ..విజయం సాధిస్తుందా..? భయపెడుతున్న సెంటిమెంట్ !!

ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లో కేవలం 5 సార్లు మాత్రమే గెలిచి, 8 సార్లు ఓటమిపాలవ్వడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లలో చిన్నస్వామి స్టేడియంలోని వేడి, ఒత్తిడి ఆటగాళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది

  • Virat Kohli

    నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd