2024 Paris Olympics : పీవీ సింధు కట్టిన చీరపై వివాదం
మీరు డిజైన్ చేసిన ఈ వేడుకల యూనిఫామ్‌ల కన్నా మెరుగైన చీరలు రూ.200లకు ముంబయి వీధుల్లో నేను చూశాను
- By Sudheer Published Date - 09:57 PM, Sat - 27 July 24

2024 పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024) ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమైనా సంగతి తెలిసిందే. ఈ వేడుకలకు క్రీడాకారులు మాత్రమే కాదు సినీ , రాజకీయ, బిజినెస్ ప్రముఖులు సైతం హాజరై సందడి చేసారు. అయితే ప్రారంభోత్సవ వేడుకల్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ధరించిన చీర (Controversy over PV Sindhu’s saree) ఆమెను వివాదంలో పడేసింది. ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించే అరుదైన గౌరవాన్నిసింధు అందుకుంది. ఈ క్రమంలో సింధు భారత సంప్రదాయ చీరలో ఆకట్టుకుంది. తెలుపు రంగుపై త్రివర్ణ పతాకంలోని మరో రెండు వర్ణాలతో రూపొందించిన చీరను ధరించి చూపరులను కట్టిపడేసింది. అలానే భారత పతాకాన్ని చేతబూని భారత అథ్లెట్ల బృందానికి నాయకత్వం వహించింది.
We’re now on WhatsApp. Click to Join.
తన జీవితంలో ఇంతకన్నా గొప్ప గౌరవం మరేదీ లేదంటూ హర్షం వ్యక్తం చేసింది. అయితే సింధు ధరించిన చీరపై కొంతమంది విమర్శలు చేస్తున్నారు. తరుణ తహిలియానీ (Designer Tarun Tahiliani) డిజైన్ చేసిన ఈ డ్రెస్‌లు చాలా చీప్‌గా ఉన్నాయంటూ బెంగళూరుకు చెందిన రచయిత డాక్టర్ నందితా అయ్యర్ పోస్ట్ పెట్టారు. మీరు డిజైన్ చేసిన ఈ వేడుకల యూనిఫామ్‌ల కన్నా మెరుగైన చీరలు రూ.200లకు ముంబయి వీధుల్లో నేను చూశాను. చౌకైన పాలిస్టర్, ఇకత్ ప్రింట్((!!!)తో దారుణంగా ఉందంటూ విమర్శించారు. పలువురు నెటిజన్స్ సైతం తరుణ తహిలియానీ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటె బ్యాడ్మింటన్ డబుల్స్ గ్రూప్ స్టేజ్‌లో భారత్ శుభారంభం పలికింది. 21-17, 21-14 తేడాతో సాత్విక్- చిరాగ్ విజయం సాధించారు. ఇక జులై 29న గ్రూప్ స్టేజ్‌లో సాత్విక్- చిరాగ్ రెండో మ్యాచ్ ఆడనున్నారు. ఈ ఒలింపిక్ క్రీడలు జులై 27 నుంచి ఆగస్టు 11 దాకా జరగనున్నాయి. ఈ క్రీడల్లో 180+ దేశాల నుంచి 10వేలకుపైగా అథ్లెట్లు పాల్గొంటున్నారు. భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు ఆయా క్రీడాంశాల్లో పోటీ పడనున్నారు.
Hello Tarun Tahiliani!
I have seen better Sarees sold in Mumbai streets for Rs.200 than these ceremonial uniforms you’ve ‘designed’.
Cheap polyester like fabric, Ikat PRINT (!!!), tricolors thrown together with no imagination
Did you outsource it to an intern or come up with it… https://t.co/aVkXGmg80K— Dr Nandita Iyer (@saffrontrail) July 27, 2024
Read Also : TTD పదవులన్నీ కమ్మ కులానికేనా..? విజయసాయి రెడ్డి