TTD పదవులన్నీ కమ్మ కులానికేనా..? విజయసాయి రెడ్డి
టీటీడీ అదనపు EOతోపాటు మరికొన్ని పదవుల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించారు
- By Sudheer Published Date - 09:37 PM, Sat - 27 July 24

TTDలోని కీలక పదవులన్నీ కమ్మ కులానికి (Kammas ) చెందినవారికే కట్టబెడుతున్నారని చంద్రబాబుపై వైసీపీ MP విజయసాయిరెడ్డి (Vijaya Sai Reddy ) మండిపడ్డారు. ఈ పదవులు చేపట్టేందుకు ఇతర కులాల్లో అర్హులు లేరా అని ఆయన నిలదీశారు. ‘టీటీడీ అదనపు EOతోపాటు మరికొన్ని పదవుల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించారు. TTD ఛైర్మన్, ఢిల్లీలో AP ప్రత్యేక ప్రతినిధిగా అదే కులానికి చెందినవారిని నియమించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అంటూ ఆరోపించారు.
అలాగే చంద్రబాబు ప్రభుత్వానికి ధైర్యముంటే ఈ నెలరోజుల్లో జరిగిన హత్యలు, అత్యాచారాలు, దాడులు, దోపిడీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండు చేశారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న శ్వేత పత్రాల్లో విషయమేమీ ఉండడం లేదని ఎద్దేవా చేసారు. టీడీపీ ప్రభుత్వం పెడుతున్న శ్వేతపత్రాలతో.. తమ హయాంలో ఇచ్చిన హామీలను నెరవేర్చబోమని చేయబోమని చెప్పినట్లు అనిపిస్తోంది. ఇలాంటి వాటితో ప్రజలు విసుగుచెందారంటే.. ఊరుకోరు. సవాళ్లకు భయపడే చంద్రబాబు.. మిత్రపక్షాల కోసమే పరుగులు తీస్తుంటారని’ , ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే మాయమవుతాయని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాదిరిగా, అధికారంలో ఉన్నప్పుడు మరో విధంగా రెండు నాలుకల ధోరణిని అవలంభించడం చంద్రబాబుకు అలవాటేనని ఆరోపించారు.
TDP has appointed Kammas in all key positions including additional E.O of TTD. Now, they are looking to appoint a Kamma as the Chairman of TTD Board and another person from the same community as the Special Representatiive AP in Delhi. @ncbn, do you not believe that people from…
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 27, 2024
Read Also : TG Assembly : బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తొడగొట్టి సవాల్ విసిరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే