HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Coffee In Hand Stylish Glasses On Eyes And Team Indias Train Journey In London Watch Video

Team India: రైలులో త‌మ బాల్యాన్ని గుర్తుచేసుకున్న టీమిండియా ఆట‌గాళ్లు.. వీడియో వైర‌ల్‌!

వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ధ్రువ్ జురెల్ తన తండ్రి ధర్మశాల (హిమాచల్ ప్రదేశ్)లో పోస్టింగ్‌లో ఉన్నప్పుడు ప్రయాణ సమయంలో తన తండ్రి ఎప్పుడూ విండో సీట్ బుక్ చేసేవారని చెప్పాడు.

  • By Gopichand Published Date - 06:08 PM, Wed - 18 June 25
  • daily-hunt
Team India
Team India

Team India: భారత్- ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ లీడ్స్‌లోని హెడింగ్లీ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు (Team India) లండన్ నుంచి లీడ్స్ వరకు రైలు ప్రయాణం చేసింది. ఈ సందర్భంగా జట్టు ఆటగాళ్లు తమ బాల్య జ్ఞాపకాలను పంచుకున్నారు. బీసీసీఐ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసింది. ఇందులో భారత ఆటగాళ్లు లండన్‌లోని హోటల్ నుంచి కాఫీ కప్పులు పట్టుకుని బయటకు వస్తూ, సెల్ఫీలు తీసుకుంటూ కనిపించారు.

వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ధ్రువ్ జురెల్ తన తండ్రి ధర్మశాల (హిమాచల్ ప్రదేశ్)లో పోస్టింగ్‌లో ఉన్నప్పుడు ప్రయాణ సమయంలో తన తండ్రి ఎప్పుడూ విండో సీట్ బుక్ చేసేవారని చెప్పాడు. అదే విధంగా సాయి సుదర్శన్ తన బాల్యంలో క్రికెట్ శిక్షణ కోసం రైలులో ప్రయాణం చేసేవాడని తెలిపాడు. రైలు లోపల కేఎల్ రాహుల్ పోజులిస్తూ కనిపించాడు. అదే సమయంలో మోర్నే మోర్కెల్ అతని ఫోటోలు తీస్తున్నాడు. ఈ సందర్భంలో వాషింగ్టన్ సుందర్‌కు ఎవరో జుట్టు సరిచేయమని చెప్పగా సుందర్ హీరోల స్టైల్‌లో తన జుట్టును సెట్ చేస్తూ కనిపించాడు. హర్షిత్ రాణా కూడా టీమ్ ఇండియాతో కలిసి ప్రయాణిస్తున్నాడు. అతన్ని అసలు భారత స్క్వాడ్‌లో చేర్చలేదని గమనించాలి.

Also Read: TGSRTC : తొలి మ‌హిళా కండ‌క్టర్లను సన్మానించిన టీజీఎస్ ఆర్టీసీ

London 🚄 Leeds

'Train'ing with #TeamIndia #ENGvIND pic.twitter.com/I1gBsTu0PC

— BCCI (@BCCI) June 18, 2025

శార్దూల్ ఠాకూర్ విండో సీట్ ఆనందం

శార్దూల్ ఠాకూర్ ముంబైకి చెందినవాడు. అతను క్రికెట్ సాధన కోసం రైలులో ప్రయాణించిన రోజులను గుర్తు చేసుకున్నాడు. అతను ఇలా అన్నాడు. నేను ఈ రైలులో విండో సీట్‌ను బాగా ఆస్వాదిస్తున్నాను. కానీ ముంబైలో అలా కాదు. అక్కడ విండో సీటు కోసం ఒక యుద్ధ‌మే చేయాలి. దానితో పోలిస్తే ఇక్కడ చాలా శాంతి ఉంది. ప్రస్తుతం విండో సీట్ సంపాదించి సంతోషంగా ఉన్నాను అని పేర్కొన్నాడు. ఈ సారి భారత జట్టు శుభ్‌మన్ గిల్ సారథ్యంలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తోంది. టీమ్ ఇండియా చివరిసారి ఇంగ్లాండ్‌ను పర్యటించినప్పుడు విరాట్ కోహ్లీ జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది.

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IND vs ENG
  • India Tour Of England
  • India vs England
  • KL Rahul
  • Shardul Thakur
  • team india

Related News

Shubman Gill

Shubman Gill : టీమిండియా ఓటమి పై స్పందించిన శుభమన్ గిల్!

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో టీమిండియా ఘోర పరాజయంపై శుభమన్ గిల్ స్పందించాడు. మెడ గాయంతో జట్టుకు దూరమైన గిల్, సోషల్ మీడియాలో స్ఫూర్తిదాయక పోస్ట్ చేశాడు. అందరం కలిసికట్టుగా పోరాడి భవిష్యత్‌లో మరింత ముందుకు వెళ్లాలని గిల్ పిలుపునిచ్చాడు. గాయం నుంచి కోలుకుంటున్న గిల్, దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.

  • Gautam Gambhir

    Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

  • IND vs SA

    IND vs SA: 25 సంవ‌త్స‌రాల త‌ర్వాత భార‌త గ‌డ్డ‌పై ఘ‌న‌విజ‌యం సాధించిన సౌతాఫ్రికా!

  • T20 World Cup 2026

    T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ విడుదల.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ ఎప్పుడంటే?

  • Shreyas Iyer

    Shreyas Iyer: జిమ్‌లో సైక్లింగ్ మొదలుపెట్టిన భారత వైస్-కెప్టెన్!

Latest News

  • CM Revanth District Tour : జిల్లాల పర్యటనలకు సిద్ధం అవుతున్న సీఎం రేవంత్

  • Sc Woman Sarpanch Seat : సర్పంచ్ పదవి కోసం ‘ఎస్సీ మహిళ’తో పెళ్లి.. కట్ చేస్తే సీన్ మెుత్తం రివర్స్..!

  • White House Shooting : వైట్ హౌస్ వద్ద కాల్పుల కలకలం

  • Village Malls : ఏపీలో రేషన్ షాపులు కాస్త విలేజ్ మాల్స్ గా మారబోతున్నాయి

  • Telangana Grama Panchayat Elections : ఓటుకు విలువ లేదా? నేతల తీరు ఇదేనా..?

Trending News

    • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

    • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

    • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

    • Constitution Day : ప్రజల మహోన్నత శక్తి.. రాజ్యాంగం

    • Mumbai 26/11 Terror Attack : ముంబై మారణహోమానికి 17 ఏళ్లు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd