HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Chetan Sharma Likely To Continue As Chief Selector

Chetan Sharma: చీఫ్ సెలక్టర్ గా మళ్ళీ చేతన్ శర్మకే బాధ్యతలు

ఊహించిందే జరిగింది.. అంతా అనుకున్నట్టుగానే బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా చేతన్ శర్మ (Chetan Sharma)నే బోర్డు మరోసారి ఎంపిక చేసింది. టీ ట్వంటీ ప్రపంచకప్ లో వైఫల్యం తర్వాత చేతన్ శర్మ సారథ్యంలోని సెలక్షన్ కమిటీపై బీసీసీఐ వేటు వేసింది. అనంతరం కొత్తగా దరఖాస్తులు ఆహ్వానించింది.

  • Author : Gopi Date : 08-01-2023 - 11:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chetan Sharma
Resizeimagesize (1280 X 720)

ఊహించిందే జరిగింది.. అంతా అనుకున్నట్టుగానే బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా చేతన్ శర్మ (Chetan Sharma)నే బోర్డు మరోసారి ఎంపిక చేసింది. టీ ట్వంటీ ప్రపంచకప్ లో వైఫల్యం తర్వాత చేతన్ శర్మ సారథ్యంలోని సెలక్షన్ కమిటీపై బీసీసీఐ వేటు వేసింది. అనంతరం కొత్తగా దరఖాస్తులు ఆహ్వానించింది. దీంతో ప్రక్షాళణ మొదలైందని భావించారు. దరఖాస్తు చేసుకునేందుకు కనీసం 7 టెస్టు మ్యాచ్‌లు, 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాలని నిబంధనలు విధించింది. అంతేకాకుండా అభ్యర్థులు ఆటకు రిటైర్మెంట్ ప్రకటించి కనీసం 5 సంవత్సరాలు పూర్తయి ఉండాలని పేర్కొంది.

సెలక్టర్ పదవి కోసం దాదాపు 600 అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో నుంచి తుది జాబితాగా 11 అప్లికేషన్లను తీసుకుంది బోర్డు. చేతన్ శర్మ కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకున్నాడు. ఈ 11 మందిని ఇంటర్యూ చేసిన బీసీసీఐ అడ్వైజరీ కమిటీ వారిలో నుంచి ఐదుగురిని ఎంపిక చేసింది. ఇంటర్వ్యూల ఆధారంగా చేతన్ శర్మ, శివ సుందర్ దాస్, సుబ్రోతో బెనర్జీ, సలిల్ అంకోల, శ్రీదరన్ శరత్‌లను ఎంపిక చేసింది. చేతన్ శర్మను కమిటీ చైర్మన్‌గా నియమించిందని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది.

Also Read: (Suryakumar Yadav: మళ్ళీ చెబుతున్నా.. ఇది నా అడ్డా

సెలెక్షన్ కమిటీలో చోటు దక్కించుకున్న మాజీ టెస్ట్ ఓపెనర్ శివ సుందర్ దాస్ సెంట్రల్ జోన్‌కు ప్రాతినిథ్యం వహించనుండగా.. మాజీ పేసర్ సుబ్రోతో బెనర్జీ ఈస్ట్ జోన్, సలిల్ అంకోల వెస్ట్ జోన్, శ్రీధరన్ శరత్ సౌత్ జోన్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే చీఫ్ సెలక్టర్ గా చేతన్ శర్మ తప్పిస్తే మరొకరు సీఈసీని ఇంటర్యూలో మెప్పించలేకపోయారు. దీంతో మరోసారి చేతన్ కే బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా చీఫ్ సెలక్టర్ కు 1.25 కోట్లు , సెలక్టర్లకు 1 కోటి రూపాయల చొప్పున వార్షిక్ వేతనం లభించనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • Board of Control for Cricket in India
  • Chetan Sharma
  • Chief Selector
  • team india

Related News

Legal notices served to actor Vijay Deverakonda.

Breaking News: హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘టీజీ20 (TG20) లీగ్’ చుట్టూ వివాదాలు కమ్ముకుంటున్నాయి తాజాగా ఈ లీగ్‌ను ప్రమోట్ చేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో పాటు పలువురు సినీ, క్రీడా ప్రముఖులకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) లీగల్ నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. బీసీసీఐ నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే హెచ్‌సీఏ టీజీ20 లీగ్‌ను నిర్వహిస్త

    Latest News

    • YOGA : ఆర్టీసీ హౌస్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

    • Rains : వారం రోజుల పాటు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

    • Jnaneswari: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఎన్నో కొత్త మలుపు.?

    • Wedding : జర్మనీలో మొదలైన ప్రేమ.. పల్నాడులో పెళ్లి పీటలు

    • Happy Fathers Day: నాన్నకు ప్రేమతో…

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd