Chennai Pitch Report: బంగ్లాకు చుక్కలు చూపించేది స్పిన్నర్లే
Chennai Pitch Report: చెన్నై పిచ్ స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉండటంతో ఈ మ్యాచ్ లో స్పిన్నర్లదే ఆధిపత్యం కనిపించొచ్చు. ఈ నేపథ్యంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ వంటి ఫాస్ట్ బౌలర్లు రాణించినా రాణించకపోయినా ఆర్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ మరియు రవీంద్ర జడేజాలు కచ్చితంగా సత్తా చాటాల్సి ఉంటుంది.
- By Praveen Aluthuru Published Date - 02:27 PM, Wed - 18 September 24

Chennai Pitch Report: సెప్టెంబర్ 19 నుండి భారత్ బంగ్లాదేశ్ మధ్య 2 టెస్ట్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. తొలి టెస్టు చెన్నై చెపాక్ లో జరుగుతుంది. ఈ టెస్టుకు భారత జట్టు జోరుగా సిద్ధమవుతుండగా.. పాకిస్థాన్‌ను ఓడించి బంగ్లాదేశ్ జట్టు కూడా ఆత్మవిశ్వాసంతో ఉంది. అందువల్ల ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా ఉంటుందని భావిస్తున్నారు.
క్రికెట్ అభిమానుల అభిప్రాయం ఏమిటంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ మరియు యశస్వి జైస్వాల్ భారీ ఇన్నింగ్స్ కు తెరలేపనున్నారు. రోహిత్ కోహ్లీ గురించి తెలిసిందే. గిల్, జైస్వాల్ కసిస్టెన్సీగా రాణిస్తే భారత జట్టు భారీ స్కోర్ చేసే అవకాశముంది. ముఖ్యంగా జైస్వాల్ ఇప్పుడిడిప్పుడే ఎదుగుతున్న ఆటగాడు. అవకాశం అందిపుచ్చుకోవడంలో జైస్వాల్ కు అలవాటే. పైగా ఈ టెస్ట్ మ్యాచ్ భర్త కు అత్యంత కీలకం. సో ఈ టెస్ట్ సిరీస్ లో ఎవరైతే మంచి స్కోర్ రాబడుతారో వాళ్ళకి జట్టులో సుస్థిర స్థానం ఉంటుంది.
జస్ప్రీత్ బుమ్రా బెంగాల్ టైగర్స్‌ని బెంబేలెత్తించడానికి సిద్దమవుతున్నాడు. బుమ్రా సరిగ్గా బౌలింగ్ చేస్తే టీమ్ ఇండియా విజయంలో అతని పాత్రే కీలకం. అయితే చెన్నై పిచ్ (Chennai Pitch ) స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉండటంతో ఈ మ్యాచ్ లో స్పిన్నర్లదే ఆధిపత్యం కనిపించొచ్చు. ఈ నేపథ్యంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ వంటి ఫాస్ట్ బౌలర్లు రాణించినా రాణించకపోయినా ఆర్ అశ్విన్ (Ravichandran Ashwin), కుల్దీప్ యాదవ్ మరియు రవీంద్ర జడేజాలు కచ్చితంగా సత్తా చాటాల్సి ఉంటుంది. నివేదికల ప్రకారం ఈ ముగ్గురు బౌలర్లు టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటారు. దాంతో వారు ముగ్గురూ బంగ్లాదేశ్‌కు పెద్ద ముప్పుగా మారే అవకాశముంది. దీంతో బంగ్లాదేశ్‌కు చెన్నై టెస్టులో కఠిన పరీక్ష తప్పదు. మరోవిశేషం ఏంటంటే చెన్నై అశ్విన్‌కు హోమ్ గ్రౌండ్ కూడా. అశ్విన్ చెన్నైలో 4 టెస్టులు ఆడాడు. ఇందులో 8 ఇన్నింగ్స్‌లలో 30 వికెట్లు పడగొట్టాడు. 4 సార్లు 5 వికెట్లు తీసుకున్నాడు. ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు తీసిన ఘనత కూడా సాధించాడు. ఒక సెంచరీ, హాఫ్ సెంచరీ కూడా చేశాడు. కాగా అశ్విన్ మూడున్నరేళ్ల తర్వాత చెన్నైలో ఆడనున్నాడు. (IND vs BAN)
అశ్విన్ 100 టెస్టుల్లో 3309 పరుగులు చేసి 519 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్‌పై అశ్విన్ 23 వికెట్లు తీశాడు. మరో 9 వికెట్లు తీస్తే.. ఈ దేశంపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం జహీర్ ఖాన్ 31 వికెట్లతో నంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. రవీంద్ర జడేజా 72 టెస్టుల్లో 3036 పరుగులు చేసి 294 వికెట్లు తీశాడు. జడేజా మరో 6 వికెట్లు తీయడం ద్వారా టెస్టుల్లో 300 వికెట్లు, 3000 పరుగులు చేసిన రెండో ఆల్‌రౌండర్‌గా నిలుస్తాడు. బంగ్లాదేశ్‌తో ఆడిన 3 మ్యాచ్‌ల్లో 148 పరుగులు చేసి 6 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ 12 టెస్టుల్లో 53 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన 1 మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టాడు.
Also Read: IND vs BAN Playing XI: కీపర్ రేసులో పంత్ వర్సెస్ ధృవ్