HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Bhutanese Bowler Sonam Yeshey Has Made History In T20 Cricket

టీ20 క్రికెట్ లో చ‌రిత్ర సృష్టించిన భూటాన్ బౌల‌ర్ సోనమ్ యెషే

  • Author : Vamsi Chowdary Korata Date : 29-12-2025 - 2:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sonam Yeshey
Sonam Yeshey

Sonam Yeshey : టీ20 క్రికెట్‌లో భూటాన్ బౌలర్ సోనం యేశే అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించాడు. మయన్మార్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 7 పరుగులు ఇచ్చి 8 వికెట్లు పడగొట్టి, టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఈ అద్భుత ప్రదర్శనతో భూటాన్ జట్టు ఘన విజయం సాధించింది. ఇది క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.

  • భూటాన్ క్రికెటర్ అరుదైన రికార్డు
  • మలేషియాతో మ్యాచ్‌లో రికార్డు సృష్టించిన యేశే
  • 45 పరుగులకే మలేషియా ఆలౌట్

టీ20 క్రికెట్ అంటేనే సిక్సర్ల మోత.. బాల్ దొరికిందా బాదుడే బాదుడు. అలాంటి టీ20 ఫార్మాట్‌లో బౌలర్లు రాణించడమంటే చాలా అరుదనే చెప్పొచ్చు. ఈ పొట్టి ఫార్మాట్‌లో నాలుగు వికెట్లు తీశారంటేనే అబ్బో మామూలుగా బౌలింగ్ చేయలేదుగా అంటారు. అలాంటిది ఓ బౌలర్ ఏకంగా 8 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డు సృష్టించారు.

భూటాన్ క్రికెట్ చరిత్రలోనే కాదు, ప్రపంచ టీ20 క్రికెట్‌లోనూ అరుదైన ఘనత నమోదైంది. భూటాన్‌కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సోనం యేశే అద్భుత ప్రదర్శనతో క్రికెట్ చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడు. నాలుగు ఓవర్లలో ఎనిమిది వికెట్లు పడగొట్టి, టీ20 ఫార్మాట్‌లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు.

గెలెఫు వేదికగా మయన్మార్‌తో జరిగిన మూడో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో సోనం యేశే ఈ అద్భుత స్పెల్ నమోదు చేశాడు. 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మయన్మార్ జట్టు, యేశే స్పిన్ దెబ్బకు కేవలం 45 పరుగులకే ఆలౌట్ అయింది. యేశే నాలుగు ఓవర్లలో 7 పరుగులు మాత్రమే ఇచ్చి 8 వికెట్లు తీసి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు.

ఇప్పటివరకు పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనగా ఏడు వికెట్ల ఘనత మాత్రమే ఉంది. కానీ సోనం యేశే ఆ రికార్డును దాటేసి, సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లకే కాకుండా, మొత్తం టీ20 క్రికెట్‌లోనూ ఇది ఎవ్వరూ చెరపలేని రికార్డుగా నిలిచింది.

ఈ సిరీస్ మొత్తం మీద కూడా యేశే అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. నాలుగు మ్యాచ్‌ల్లో కలిపి 12 వికెట్లు తీసి భూటాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2022లో మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేసిన యేశే, ఇప్పటివరకు 34 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 37 వికెట్లు సాధించాడు. భూటాన్ వంటి ఎదుగుతున్న క్రికెట్ దేశం నుంచి వచ్చిన ఈ అరుదైన ప్రదర్శన, ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తోంది. సోనం యేశే ప్రదర్శన యువ క్రికెటర్లకు ప్రేరణగా నిలుస్తుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bhutan
  • cricket news
  • Historic T20 Record
  • Sonam Yeshey
  • T20 cricket

Related News

Notices to Team India Players Yashasvi Jaiswal, Shafali Verma

NADA: టీమిండియా ఆటగాళ్లకు నోటీసులు

భారత క్రికెట్‌లో కలకలం రేగింది. టీమిండియా యువ సంచలనాలు, స్టార్ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, షఫాలీ వర్మలకు జాతీయ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ (నాడా) నోటీసులు జారీ చేసింది. డోప్ టెస్టింగ్ కోసం నిర్దేశిత సమయంలో అందుబాటులో లేకపోవడంతో ‘వేర్‌అబౌట్స్ ఫెయిల్యూర్’ కింద వారిపై ఈ చర్యలు తీసుకుంది. ఈ విషయంపై బీసీసీఐ, ఐసీసీలకు కూడా ‘నాడా’ సమాచారం అందించింది. నాడా నిబంధనల ప్రకారం ‘రిజ

  • Who is Team India's new T20 captain?

    T20 Captain: టీమిండియా టీ20 కొత్త కెప్టెన్‌ ఎవరంటే?

  • Former Punjab Kings Pacer Amanpreet Singh Gill Rest in Peace

    Amanpreet Singh: కోహ్లీ సహచరుడు.. పంజాబ్ కింగ్స్ ప్లేయర్ కన్నుమూత

  • BCCI Announces IPL 2026 Playoffs schedule

    IPL 2026: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల.. ఈసారి ఫైనల్‌ అక్కడే?

Latest News

  • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

  • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

  • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

  • Roja Selvamani: మరోసారి జగన్‌ను విజయ్ ఫాలో అవుతున్నారు – రోజా

  • Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్.. రౌడీ జనార్ధన’ న్యూ పోస్టర్‌

Trending News

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

    • Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

    • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

    • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd