HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Bcci Has Sacked The Entire Senior Selection Committee

BCCI: సెలక్షన్ కమిటీపై బీసీసీఐ వేటు

టీ ట్వంటీ ప్రపంచకప్ వైఫల్యం నేపథ్యంలో బీసీసీఐ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా మొత్తం సెలక్షన్ కమిటీపైనే వేటు వేసింది.

  • Author : Naresh Kumar Date : 19-11-2022 - 12:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
BCCI
BCCI

టీ ట్వంటీ ప్రపంచకప్ వైఫల్యం నేపథ్యంలో బీసీసీఐ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా మొత్తం సెలక్షన్ కమిటీపైనే వేటు వేసింది. చేతన్ శర్మ సారథ్యంలోని సెలక్షన్ కమిటీని తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. వీరి స్థానంలో ఐదుగురు కొత్త సెలక్టర్లను నియమించనుంది.

దీని కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. భారీ అంచనాల మధ్య టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఆడిన టీమిండియా సెమీఫైనల్లో నిష్క్రమించింది. ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోవడంతో జట్టుపై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా జట్టు ఎంపిక విషయంలో సెలక్షన్ కమిటీ వైఖరిపైనా పలువురు మాజీలు , బీసీసీఐలో కొందరు సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. జట్టులో పలువురు సీనియర్ ఆటగాళ్ళపైనా విమర్శలు రావడంతో ప్రక్షాళన ఖాయమని భావించారు. అయితే జట్టు కంటే ముందు సెలక్షన్ కమిటీపైనే బోర్డు చర్యలు తీసుకుంది.

చేతన్ శర్మతో పాటు దేబాశిష్ మొహంతి, హర్విందర్ సింగ్, సునీల్ జోషీల స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 7 టెస్టు మ్యాచ్‌లు, 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్ క్లాస్‌ మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించి ఉండాలి. అంతేకాకుండా అభ్యర్థులు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుని కనీసం 5 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలని బీసీసీఐ తన ప్రకటనలో తెలిపింది. కాగా కొత్త సెలక్షన్ కమిటీ రేసులో మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ చోటు దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • senior selection team
  • team india

Related News

BCCI Issues Key Directives to Hardik and Rohit

BCCI: హార్దిక్‌, రోహిత్‌లకు బీసీసీఐ కీలక ఆదేశాలు

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక కీలక నిర్ణయంతో టీమిండియా స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలపై కఠిన వైఖరిని ప్రదర్శించింది. త్వరలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు ముందు, వీరిద్దరినీ తక్షణమే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఏర్పాటు చేసిన సన్నాహక శిబిరానికి రిపోర్ట్ చేయాలని బోర్డు ఆదేశించింది. రాబోయే సిరీస్ కోసం ఆటగాళ్ల ఫిట్‌నెస్, సంస

    Latest News

    • Chandrababu Naidu: ఢిల్లీకి సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్.!

    • Visakhapatnam Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

    • Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

    • Crime News Hyderabad: పెన్షన్ డబ్బు కోసం కన్నతండ్రిని చంపిన కొడుకు, కూతురు కు ఉరి శిక్ష, తల్లికి జీవిత ఖైదు

    • Physical Relation: ఐదు గంటల పాటు నిర్విరామంగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఏం జరిగిందంటే?

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd