Bangladesh beat England: ఇంగ్లండ్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్.. టీ20ల్లో తొలిసారి ఇంగ్లండ్ జట్టుపై విజయం
టీ20 మ్యాచ్‌లో ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లండ్ (England)ను ఓడించడం ద్వారా బంగ్లాదేశ్ (Bangladesh) క్రికెట్ జట్టు వార్తలలో నిలిచింది. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. గురువారం బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ మధ్య సిరీస్‌లోని మొదటి T20 మ్యాచ్ జరిగింది.
- By Gopichand Published Date - 08:15 AM, Fri - 10 March 23

టీ20 మ్యాచ్‌లో ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లండ్ (England)ను ఓడించడం ద్వారా బంగ్లాదేశ్ (Bangladesh) క్రికెట్ జట్టు వార్తలలో నిలిచింది. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. గురువారం బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ మధ్య సిరీస్‌లోని మొదటి T20 మ్యాచ్ జరిగింది. ఇందులో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. టీ20 ఫార్మాట్‌లో ఇంగ్లండ్‌పై బంగ్లాదేశ్ జట్టుకు ఇదే తొలి విజయం. చట్‌గావ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లండ్ తరఫున కెప్టెన్ జోస్ బట్లర్ 42 బంతుల్లో 67 పరుగుల అత్యధిక స్కోర్ సాధించాడు. ఫిలిప్ షౌల్ట్ 35 బంతుల్లో 38 పరుగులు చేశాడు. వీరిద్దరూ తప్ప మరే ఇతర ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ కూడా 20 పరుగుల స్కోరును దాటలేకపోయారు.
Also Read: Sumalatha: బీజేపీలోకి సుమలత.. కర్ణాటక సీఎం ఏం అన్నారంటే..?
బంగ్లాదేశ్ తరఫున తొలి ఇన్నింగ్స్‌లో హసన్ మహమూద్ అత్యధికంగా 2 వికెట్లు తీయగా, మిగతా బంగ్లాదేశ్ బౌలర్లందరికీ ఒక్కో వికెట్ దక్కింది. 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన బంగ్లాదేశ్ బ్యాటింగ్‌కు దిగింది. బంగ్లాదేశ్ తరఫున నజ్ముల్ హుస్సేన్ శాంటో అత్యధికంగా 51 పరుగులు చేశాడు. ఇది కాకుండా, చివరికి కెప్టెన్ షకీబ్ అల్ హసన్ కూడా 24 బంతుల్లో 34 పరుగుల ఇన్నింగ్స్ ఆడి ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లాండ్ జట్టుపై తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
ఈ మ్యాచ్‌లో 30 బంతుల్లో 51 పరుగులు చేసిన నజ్నుల్ హుస్సేన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగా, బంగ్లాదేశ్ మరో రెండు టీ20 మ్యాచ్‌లలో ఒకటైనా గెలిస్తే సిరీస్‌ను కైవసం చేసుకునే అవకాశం ఉంది. అయితే, అంతకుముందు ఇంగ్లండ్, బంగ్లాదేశ్ మధ్య వన్డే సిరీస్ కూడా జరిగింది. ఇందులో ఇంగ్లండ్ బంగ్లాదేశ్‌ను 2-1తో ఓడించింది.

Related News

IPL 2023: పంత్ లేకున్నా బలంగానే ఢిల్లీ
ఐపీఎల్ ప్రారంభమై 15 ఏళ్ళు పూర్తయినా ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్లు కొన్ని ఉన్నాయి. ఆ జాబితాలో చెప్పుకోవాల్సింది ఢిల్లీ క్యాపిటల్స్ గురించే..