England on Top: పట్టు జారవిడిచారు… విజయం దిశగా ఇంగ్లాండ్
మూడు రోజుల పాటు ఆధిపత్యము కనబరిచిన భారత్ ఇప్పుడు కీలక సమయంలో పట్టు జారవిడిచింది.
- Author : Naresh Kumar
Date : 04-07-2022 - 11:56 IST
Published By : Hashtagu Telugu Desk
మూడు రోజుల పాటు ఆధిపత్యము కనబరిచిన భారత్ ఇప్పుడు కీలక సమయంలో పట్టు జారవిడిచింది. ఫలితంగా బర్మింగ్ హామ్ టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ విజయం దిశగా సాగుతోంది. భారత్ ఉంచిన 378 పరుగుల టార్గెట్ చేధించే క్రమంలో ఇంగ్లాండ్ కు ఓపెనర్లు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. వన్డే తరహాలో చెలరేగి ఆడారు. ఓపెనర్లు లీస్, క్రాలీ కలిసి తొలి వికెట్‌కు 21.4 ఓవర్లలోనే 107 రన్స్ జోడించారు.
అయితే టీ సమయానికి కాస్త ముందు క్రాలీ 46ని బుమ్రా ఔట్ చేశాడు. కాసేపటికే ఓలీ పోప్ , హాఫ్ సెంచరీ చేసిన లీస్ కూడా ఔటవడంతో ఇంగ్లండ్ 109 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడినట్లు కనిపించింది. అయితే ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన బెయిర్‌స్టో.. రూట్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. భారత్ బౌలర్లు వికెట్ తీయకపోగా.. ప్రతి ఓవర్‌కూ ఓ బౌండరీ ఇచ్చుకోవడంతో మ్యాచ్ ఇంగ్లాండ్ వైపు తిరిగింది. భారత్ తరఫున కెప్టెన్ బుమ్రా తప్ప మిగతా బౌలర్లంతా తేలిపోయారు.
రూట్, బెయిర్‌స్టో నాలుగో వికెట్‌కు అజేయంగా 151 రన్స్ జోడించారు. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్లకు 260 రన్స్ చేసింది.
ఐదో రోజు ఆట మిగిలి ఉండగా విజయం కోసం ఇంగ్లాండ్ ఇంకా 118 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. రూట్ 76 నాటౌట్ , బెయిర్‌స్టో 73 నాటౌట్ క్రీజులో. ఉండగా కెప్టెన్ బెన్ స్టోక్స్, సామ్ బిల్లింగ్స్ రూపంలో ఇంకా ఇద్దరు మంచి బ్యాటర్లు కూడా ఆ టీమ్‌కు ఉండడంతో ఇంగ్లాండ్ విజయం లాంఛనమే. అంతకుముందు నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్‌లో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 245 పరుగులకు ఆలౌటైంది. పుజారా , రిషబ్ పంత్ మాత్రమే హాఫ్ సెంచరీలతో రాణించారు.
https://twitter.com/BCCI/status/15440141387870412821544014138787041282