Axar Patel: రేపే ఆసియా కప్ ఫైనల్.. టీమిండియాకు షాక్
ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) గాయం కారణంగా ఫైనల్ మ్యాచ్ కు దూరం అయ్యే అవకాశం ఉందని సమాచారం.
- By Gopichand Published Date - 02:42 PM, Sat - 16 September 23

Axar Patel: ఆసియా కప్ 2023 చివరి మ్యాచ్ కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరగనుంది. ఫైనల్ మ్యాచ్ కు ముందు టీమిండియాకి షాక్ తగిలింది. ఒక నివేదిక ప్రకారం.. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) గాయం కారణంగా ఫైనల్ మ్యాచ్ కు దూరం అయ్యే అవకాశం ఉందని సమాచారం. శుక్రవారం జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్‌పై భారత్ ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో అక్షర్ 42 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. అక్షర్ గైర్హాజరీలో వాషింగ్టన్ సుందర్‌కు ఫైనల్ కు అవకాశం ఇవ్వొచ్చని సమాచారం.
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. భారత్- బంగ్లాదేశ్ మధ్య జరిగిన చివరి సూపర్ ఫోర్ మ్యాచ్‌లో అక్షర్ గాయపడ్డాడు. అతని గాయం తీవ్రంగా లేనప్పటికీ బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ భారత్ తరఫున ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. టీమ్ ఇండియాను గెలిపించలేకపోయినప్పటికీ అక్షర్ 34 బంతులు ఎదుర్కొని 42 పరుగులు చేశాడు. 3 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. దీంతో పాటు అక్షర్ 9 ఓవర్లలో 47 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.
Also Read: Theekshana Ruled Out: ఆసియా కప్ ఫైనల్ కు ముందు శ్రీలంక జట్టుకు భారీ ఎదురుదెబ్బ
ఆసియా కప్ 2023లో చివరి సూపర్ ఫోర్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో టీమిండియా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ ద్వారా భారత జట్టు తన బెంచ్ బలాన్ని పరీక్షించుకుంది. విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి లభించింది. వారి గైర్హాజరీతో ప్లేయింగ్ ఎలెవన్‌లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమీకి చోటు దక్కింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత జట్టు గెలవలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 265 పరుగులు చేసింది. దీంతో భారత ఆటగాళ్లు కేవలం 259 పరుగులు మాత్రమే చేయగలిగారు.
అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ ను బీసీసీఐ అధికారులు శ్రీలంకకు పిలిపించినట్లు సమాచారం. వాషింగ్టన్ సుందర్ ఆసియా క్రీడలు 2023 కోసం టీమ్ ఇండియాలో సభ్యుడు. వాషింగ్టన్ సుందర్ ఇప్పటివరకు భారత్ తరఫున ఆడిన 16 వన్డేల్లో 16 వికెట్లు పడగొట్టి 233 పరుగులు చేశాడు. సుందర్ 4 టెస్టు మ్యాచ్‌లు కూడా ఆడాడు.