Asia Cup Super 4: నేడు బంగ్లాతో భారత్ మ్యాచ్.. గెలిస్తే ఫైనల్‌కే!
టీమిండియాకు ఆసియా కప్ 2025 చాలా గొప్పగా సాగింది. ఇప్పటివరకు టీమిండియా తమ అన్ని మ్యాచ్‌లలో గెలిచింది. ఈ టోర్నమెంట్‌లో సూర్యకుమార్ నేతృత్వంలోని టీమిండియా రెండుసార్లు పాకిస్తాన్‌ను ఓడించింది.
- By Gopichand Published Date - 02:00 PM, Wed - 24 September 25

Asia Cup Super 4: టీమిండియా ఆసియా కప్ 2025 సూపర్-4లో (Asia Cup Super 4) భాగంగా బంగ్లాదేశ్‌తో ఈ రోజు తలపడనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ గెలిస్తే టీమిండియా నేరుగా ఆసియా కప్ 2025 ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై ప్రత్యేక దృష్టి ఉండనుంది. హార్దిక్ టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఒక అరుదైన రికార్డుకు దగ్గరగా ఉన్నాడు.
హార్దిక్ అద్భుతమైన ఫీట్ సాధిస్తాడా!
బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా అద్భుతమైన బౌలింగ్ చేసి టీ20 ఇంటర్నేషనల్‌లో 100 వికెట్లు పూర్తి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం హార్దిక్ టీ20 ఇంటర్నేషనల్‌లో 97 వికెట్లు సాధించి ఈ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారతీయ బౌలర్లలో రెండవ స్థానంలో ఉన్నాడు.
అంతకుముందు ఈ ఘనత అర్ష్‌దీప్ సింగ్ సాధించాడు. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక వికెట్ తీసి అర్ష్‌దీప్ సింగ్ టీ20 ఇంటర్నేషనల్‌లో 100 వికెట్లు తీసిన మొదటి భారతీయ బౌలర్‌గా నిలిచాడు. అర్ష్‌దీప్ అతి తక్కువ మ్యాచ్‌లలో ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు ఈ మైలురాయిని చేరుకోవడానికి హార్దిక్‌కు మూడు వికెట్లు కావాలి. బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో మూడు వికెట్లు తీస్తే హార్దిక్ 100 వికెట్లు సాధించిన రెండవ భారతీయ బౌలర్‌గా నిలుస్తాడు.
Also Read: CBN Legal Notice: సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు..ఎవరు పంపారో తెలుసా..?
టీ20 ఇంటర్నేషనల్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారతీయ బౌలర్ల జాబితా ప్రకారం.. అర్షదీప్ సింగ్ 100 వికెట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా 97 వికెట్లతో, యుజ్వేంద్ర చాహల్ 96 వికెట్లతో, జస్‌ప్రీత్ బుమ్రా 92 వికెట్లతో ఉన్నారు.
ఫైనల్‌కు చేరువలో టీమిండియా
టీమిండియాకు ఆసియా కప్ 2025 చాలా గొప్పగా సాగింది. ఇప్పటివరకు టీమిండియా తమ అన్ని మ్యాచ్‌లలో గెలిచింది. ఈ టోర్నమెంట్‌లో సూర్యకుమార్ నేతృత్వంలోని టీమిండియా రెండుసార్లు పాకిస్తాన్‌ను ఓడించింది. సూపర్-4లో తమ మొదటి మ్యాచ్‌లో భారత్ జట్టు పాకిస్తాన్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. ఆ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా నాలుగు ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ఇప్పుడు బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా టీమిండియా, అభిమానులు ఈ ఆటగాళ్ల నుండి అద్భుతమైన ప్రదర్శనను ఆశిస్తున్నారు.