HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Asia Cup Pakistan Beat Uae After Boycott Drama To Face India In Super 4

Asia Cup: మ‌రోసారి భార‌త్‌- పాక్ మ్యాచ్‌.. ఎప్పుడంటే!?

147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ జట్టు 17.4 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్ అయింది. పాకిస్థాన్ ఈ మ్యాచ్‌ను 41 పరుగుల తేడాతో గెలుచుకుంది. పాకిస్థాన్ తరపున బౌలింగ్ చేసిన షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్ తలో 2 వికెట్లు తీశారు.

  • By Gopichand Published Date - 09:58 AM, Thu - 18 September 25
  • daily-hunt
Asia Cup Final
Asia Cup Final

Asia Cup: ఆసియా కప్ 2025 (Asia Cup)లో పాకిస్థాన్ సూపర్-4కు అర్హత సాధించింది. టోర్నీలో భాగంగా 10వ మ్యాచ్‌లో యూఏఈని ఓడించి ఈ ఘనత సాధించింది. ఈ ఓటమితో ఆసియా కప్ 2025 నుంచి యూఏఈ జట్టు నిష్క్రమించింది. ఇప్పుడు ఆసియా కప్ 2025లో మరోసారి భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉత్కంఠ పోరు జరగనుంది. అంతకుముందు లీగ్ మ్యాచ్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పాకిస్థాన్‌ను ఓడించి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఫైట్ ఈరోజు

ఆసియా కప్ 2025లో అభిమానులకు రెండోసారి భారత్-పాకిస్థాన్‌ల మధ్య పోరాటం చూడబోతున్నారు. సూపర్-4లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 21న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఇదే స్టేడియంలో టీమిండియా ఇంతకుముందు పాకిస్థాన్‌ను ఓడించింది. టీమిండియా ఇప్పటికే తమ రెండు మ్యాచ్‌లలో గెలిచి సూపర్-4కు అర్హత సాధించింది. టీమిండియా తమ మూడో మ్యాచ్‌ను సెప్టెంబర్ 19న అబుదాబిలో ఒమన్‌తో ఆడనుంది.

Also Read: Heavy Rains: నేడు ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు.. జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రించిన ఐఎండీ!

యూఏఈని ఓడించి క్వాలిఫై అయిన పాకిస్థాన్

యూఏఈతో జరిగిన మ్యాచ్ పాకిస్థాన్‌కు చావో-రేవోగా మారింది. ఈ మ్యాచ్‌లో పాక్ జట్టు ఓడిపోతే సూపర్-4 రేసు నుంచి నిష్క్రమించాల్సి వచ్చేది. కానీ అలా జరగలేదు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 146 పరుగులు చేసింది. పాకిస్థాన్ తరపున ఫఖర్ జమాన్ 50 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, షాహీన్ అఫ్రిది 29 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. యూఏఈ తరపున జునైద్ సిద్ధిఖీ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు.

147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ జట్టు 17.4 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్ అయింది. పాకిస్థాన్ ఈ మ్యాచ్‌ను 41 పరుగుల తేడాతో గెలుచుకుంది. పాకిస్థాన్ తరపున బౌలింగ్ చేసిన షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్ తలో 2 వికెట్లు తీశారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • asia cup
  • ind vs pak
  • PAK vs UAE
  • sports news
  • Super 4 Matches

Related News

Cricket Retirement

Cricket Retirement: రిటైర్మెంట్ తీసుకున్న క్రికెటర్ మళ్లీ జ‌ట్టులోకి తిరిగి రావచ్చా?

ఇంగ్లాండ్‌కు చెందిన కెవిన్ పీటర్సన్ కూడా 2011లో వైట్ బాల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి, కొన్ని నెలల తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

  • IND vs AUS

    IND vs AUS: ఆస్ట్రేలియా సిరీస్.. కోహ్లీ, రోహిత్‌తో సహా టీమిండియా ఆ రోజునే బయలుదేరనుంది!

  • Yuzvendra Chahal

    Yuzvendra Chahal: రెండు నెలల్లో మోసం చేస్తే నాలుగున్నరేళ్లు ఎలా నిలబడుతుంది?: చాహల్

  • Rohit Sharma

    Rohit Sharma: రోహిత్ శ‌ర్మ‌కు హిట్ మ్యాన్ అనే పేరు ఎలా వ‌చ్చిందో తెలుసా?

  • Cricket Retirement

    Rohit Sharma: రంజీ ట్రోఫీ జట్టులో రోహిత్ శర్మ.. అసలు విషయం ఏంటంటే?

Latest News

  • 42 Percent Reservation: 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతాం: మంత్రి

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆన్‌లైన్‌లో కన్ఫర్మ్ టికెట్ తేదీ మార్చుకునే సదుపాయం!

  • Curry Leaves: 30 రోజుల్లో మీ జుట్టు పెర‌గాలంటే.. కరివేపాకును ఉపయోగించండిలా!

  • Diwali: పిల్లలకు దీపావళి అంటే అర్థం చెప్పడం ఎలా?

  • Nobel Prize In Chemistry: రసాయన శాస్త్రంలో నోబెల్ బ‌హుమ‌తి పొందిన వారు వీరే!

Trending News

    • UPI Update: యూపీఐలో ఈ మార్పులు గ‌మ‌నించారా?

    • Carney- Trump: కెనడా, అమెరికా మధ్య కీలక భేటీ.. ట్రంప్ నోట విలీనం మాట‌!

    • Gold: బంగారం ఎందుకు తుప్పు ప‌ట్ట‌దు.. కార‌ణమిదేనా?

    • Top ODI Captains: వన్డే క్రికెట్‌లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌లు వీరే.. టీమిండియా నుంచి ఇద్ద‌రే!

    • Shilpa Shetty: బాలీవుడ్ హీరోయిన్‌కు 4 గంట‌లపాటు చుక్క‌లు చూపించిన పోలీసులు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd