HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Asia Cup 2025 Bcci Officials Also Turned Away From India Pakistan Match

BCCI: భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు దూరంగా బీసీసీఐ?!

భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను ఆపాలని కోరుతూ నలుగురు న్యాయ విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను వెంటనే విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.

  • By Gopichand Published Date - 02:49 PM, Sat - 13 September 25
  • daily-hunt
BCCI
BCCI

BCCI: సెప్టెంబర్ 14న భారత్, పాకిస్తాన్‌ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరగనుంది. అయితే పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంతో ఈ మ్యాచ్‌పై భారతదేశ ప్రజల్లో చాలా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీని కారణంగా సోషల్ మీడియాలో ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. టీమ్ ఇండియా మాజీ క్రికెటర్లు కూడా ఈ మ్యాచ్ నిర్వహణకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు బీసీసీఐ (BCCI) అధికారులు కూడా భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు దూరంగా ఉన్నట్లు అనిపిస్తోంది.

బీసీసీఐ అధికారులు ముఖం చాటేశారా?

మీడియా నివేదికల ప్రకారం.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను చూడటానికి బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఏ అధికారి కూడా దుబాయ్ చేరుకోలేదు. ఈ మ్యాచ్ రేపు అంటే సెప్టెంబర్ 14న జరగనుంది. గతంలో భారత్-పాక్ మ్యాచ్‌కి బీసీసీఐ అధికారి హాజరు కాకుండా ఉండటం ఎప్పుడూ జరగలేదు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా భారత్, పాకిస్తాన్ మధ్య దుబాయ్‌లో ఒక మ్యాచ్ జరిగింది., ఆ సమయంలో చాలా మంది బీసీసీఐ అధికారులు మ్యాచ్ చూడటానికి దుబాయ్ వెళ్లారు.

Also Read: Putin Closest Friend: ఈనెల‌లో భార‌త్‌ను సంద‌ర్శించ‌నున్ను ర‌ష్యా నిపుణుడు!

మ్యాచ్‌కు వ్యతిరేకత

ఆసియా కప్‌లో జరగనున్న భారత్-పాక్ మ్యాచ్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధూమల్ కూడా ఈ మ్యాచ్‌ను చూడకూడదని నిర్ణయించుకున్నారు. బీసీసీఐ కార్యదర్శి దేవ్జీత్ సైకియా కూడా ఈ మ్యాచ్‌కు హాజరు కావడం కష్టం. ఎందుకంటే ఆయన ప్రస్తుతం భారతదేశం ఆతిథ్యం ఇస్తున్న మహిళల ప్రపంచ కప్ సన్నాహాల్లో నిమగ్నమై ఉన్నారు.

మ్యాచ్‌ను నిలిపివేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్

భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను ఆపాలని కోరుతూ నలుగురు న్యాయ విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను వెంటనే విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. మరోవైపు ఈ మ్యాచ్ టికెట్లు కూడా ఇంకా పూర్తిగా అమ్ముడుపోలేదని పలు నివేదికలు చెబుతున్నాయి. కాబట్టి ఈసారి భారత్-పాక్ మ్యాచ్ సమయంలో స్టేడియం ఖాళీగా కనిపించవచ్చు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Asia Cup 2025
  • BCCI
  • BCCI Officials
  • boycott
  • Ind-Pak
  • India-Pakistan Match
  • sports news

Related News

Smriti Mandhana

Smriti Mandhana: స్మృతి మంధానా పెళ్లి క్యాన్సిల్ అయిందా?!

స్మృతి మంధానా- పలాష్ ముచ్ఛల్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వస్తున్న అనేక పుకార్ల మధ్య పలాష్ సోదరి పలక్ అందరినీ తమ, కుటుంబ గోప్యతను పాటించాలని కోరారు.

  • India vs South Africa

    India vs South Africa: రెండో టెస్ట్‌లో భారత్‌కు భారీ లక్ష్యం.. టీమిండియా గెలుపు క‌ష్ట‌మేనా?!

  • Shreyas Iyer

    Shreyas Iyer: జిమ్‌లో సైక్లింగ్ మొదలుపెట్టిన భారత వైస్-కెప్టెన్!

  • IND vs SA

    IND vs SA: భారత్‌కు సౌతాఫ్రికా ఫాలో-ఆన్ ఎందుకు ఇవ్వలేదు?

  • India vs South Africa

    IND vs SA: గువాహటి టెస్ట్‌లో టీమిండియా గెల‌వ‌గ‌ల‌దా? గ‌ణంకాలు ఏం చెబుతున్నాయంటే?!

Latest News

  • Sarpanch Election Schedule: పంచాయతీ ఎన్నికల నగారా.. నేటి నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి!

  • Bihar Speaker: బీహార్‌లో స్పీకర్ పదవిపై రాజకీయ పోరు.. బీజేపీ, జేడీయూలలో ఎవరికి దక్కేను?

  • Bihar Election Results Effect : ఏడుగురు నేతలపై కాంగ్రెస్ వేటు

  • Telangana Cabinet Decisions : తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు

  • H5N5 Virus: కరోనా తర్వాత ప్రపంచంలోకి కొత్త వైరస్!

Trending News

    • Miss Universe-2025 : ర్యాంప్ వాక్ చేస్తూ కిందపడ్డ మిస్ యూనివర్స్ బ్యూటీ

    • Private Travels Ticket Rates : సంక్రాంతికి ఊరు వెళ్దామనుకుంటున్నారా.. మీకో బ్యాడ్‌న్యూస్!

    • Andhra Pradesh Government : వారంతా రూ.10 వేలు చెల్లించాల్సిన అవసరం లేదు.. పూర్తిగా ఉచితం.!

    • Bank: రేపు ఈ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయా?

    • Punjabi Cremation: ధర్మేంద్రకు తుది వీడ్కోలు.. సిక్కు సంప్రదాయంలో అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd