YV Subba Reddy : ఏపీ రాజధానిగా హైదరాబాద్.. వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు
- By Kavya Krishna Published Date - 10:24 AM, Tue - 13 February 24

ఏపీలో ఎన్నికల (Andhra Pradesh Election) వేళ మరోసారి ఉమ్మడి రాజధాని వ్యవహారం తెరపైకి వచ్చింది. ఏపీకి రాజధాని లేదంటే వస్తున్న వదంతులను కట్టిడి చేసేందుకు ఏపీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని (Common Capital)గా కొనసాగించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో పాలనా రాజధాని ఏర్పాటయ్యే వరకు దీన్ని అమలు చేయాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. రాజ్యసభలోనూ దీనిపై చర్చిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. అయితే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విభజించిన కేంద్ర ప్రభుత్వం.. విభజన సమయంలో హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా పదేళ్ల పాటు ఏర్పాటు చేసింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. అయితే.. 2014 జూన్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విభజన జరిగి ఈ ఏడాది జూన్ వస్తే పదేళ్లు పూర్తవుతుంది. దీంతో ఉమ్మడి రాజధాని గడువు కూడ ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి రాజధాని గడువును ఇంకొన్ని రోజుల పాటు పొడగించేందుకు ఏపీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా నిన్న నామినేషన్ వేశారు వైవీ సుబ్బారెడ్డి.
We’re now on WhatsApp. Click to Join.
అంతేకాకుండా.. నిన్న ప్రత్యేకహోదాపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ పోరాటం కొనసాగిస్తుందని ఆయన వెల్లడించారు. అలాగే విభజన హామీలపై రాజ్యసభలో ఒత్తిడి తెస్తామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుత ఏపీ పరిస్థితిలో నూతన రాజధాని నిర్మాణం చేపట్టే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు వైవీ సుబ్బారెడ్డి. కేంద్రంలో ప్రభుత్వం బలంగా ఉన్నంత వరకు ఏపీకి ప్రత్యేక హోదా కష్టమేనని వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. ఏపీలో సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో సత్సంబంధాలు కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన నొక్కి చెప్పారు. అయితే.. మరోసారి ఉమ్మడి రాజధాని అంశం తెరపైకి రావడంతో రాజకీయాల్లో చర్చలు మొదలైంది. ఏపీలో రానున్న ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి రాజధాని అంశం కలిసొచ్చే విషయమే అయినా.. ఎంతవరకు వారికి లాభాన్ని కలిగిస్తుందో చూడాలి మరి.
Read Also : Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం ఇంట్లో విషాదం