YSR Yantra Seva : రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్…ఖాతాల్లోకి రూ. 175కోట్లు జమ.. !
వైఎస్ జగన్ ప్రభుత్వం రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్సార్ యంత్ర సేవ పథకం రాష్ట్రస్థాయి మేళా మంగళవారం గుంటూరులో సీఎం జగన్ ప్రారంభించనున్నారు.
- By hashtagu Published Date - 09:46 AM, Tue - 7 June 22

వైఎస్ జగన్ ప్రభుత్వం రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్సార్ యంత్ర సేవ పథకం రాష్ట్రస్థాయి మేళా మంగళవారం గుంటూరులో సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అనంతరం 5,262 రైతు గ్రూపుల బ్యాంక్ ఖాతాలకు రూ.175.61 కోట్ల సబ్సిడీని జమ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్బీకే, క్లస్టర్ స్థాయి యంత్ర సేవ కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ హార్వెస్టర్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వీటితోపాటుగా 5,262 రైతు గ్రూపు బ్యాంకు ఖాతాలకు రూ. .175.61 కోట్ల సబ్సిడీని ముఖ్యమంత్రి జమ చేయనున్నారు. వైఎస్సార్ యంత్ర మిత్ర, రైతు గ్రూపలతోపాటు ఖాతాల్లోకి డబ్బుల పంపిణీ, హరిత నగరాల ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకెళ్తూ…పల్నాడు జిల్లా కొండవీడులో జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్నారు.
కాగా రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గించడంతోపాటుగా మెరుగైన ఆదాయం అందించాలన్న ఉద్దేశ్యంతో వైఎస్సార్ యంత్ర సేవా పథకానికి రాష్ట్ర సర్కార్ రూపకల్పన చేసింది. పేద రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చి సాగు వ్యయం తగ్గించడంతోపాటు నికర ఆదాయం పెంచాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది జగన్ సర్కార్. రైతులకు తక్కవ అద్దేకు సాగు యంత్రాలు, పనిముట్లను అందుబాటులో ఉంచి, విత్తు నుంచి కోత వరకు పరికరాలను సకాలంలో అందించేందుకు రూ. 2,106కోట్ల వ్యవయంతో ఆర్బీకే స్థాయిలో ఒక్కోక్కటి రూ. 15లక్షల విలువచేసే 10,750 వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.
వరిఎక్కువగా పండించే 20 జిల్లాల్లో ఒక్కోక్కటి రూ. 25లక్షల విలువ చేసే కంబైన్డ్ హార్వెస్టర్లతోకూడిన 1,615 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలను సర్కార్ ఏర్పాటు చేస్తోంది. రైతు గ్రూపులే ఈ యంత్ర సేవా కేంద్రాలు నిర్వహించనున్నాయి. రైతులు యంత్ర సేద్యం దిశగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో యాంత్రీకరణకు పెద్దపీట వేస్తూ యంత్ర పరికరాలను పెద్ద సంఖ్యలో అందిస్తోంది. రైతుల గ్రూపులకు 40శాతం రాయితీతో సబ్సిడీ సాగు యంత్రాలు, వ్యవసాయ పనిముట్లు అందిస్తోంది ప్రభుత్వం. అంతేకాదు ఆప్కాబ్, డిసిసిబి ద్వారా యంత్ర పరికరాల ఖరీదులో మరో 50శాతం రుణాన్ని రైతులకు తక్కువ వడ్డీకే అందిస్తోంది. కాగా మంగళవారం జరిగే మెగా మేళాలో ట్రాక్టర్లతోపాటు…వాటి అనుసంధాన పరికరాలను ఉచితంగా పంపిణీ చేయనుంది.