Video Viral : పందెం ఓడి అరగుండు గీయించుకున్న వైసీపీ వీరాభిమాని..
Video Viral : తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం ఉనగట్ల గ్రామానికి చెందిన శివరామకృష్ణ అలియాస్ శివ అనే యువకుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి వీరాభిమాని. తాను జగన్ గెలుస్తారని నమ్మి స్నేహితులతో చేసిన ఓ పందెం ఇప్పుడు ఆయనను అరగుండు వరకు తీసుకెళ్లింది. అదే విషయం సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.
- By Kavya Krishna Published Date - 12:02 PM, Sat - 31 May 25

Video Viral : తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం ఉనగట్ల గ్రామానికి చెందిన శివరామకృష్ణ అలియాస్ శివ అనే యువకుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి వీరాభిమాని. తాను జగన్ గెలుస్తారని నమ్మి స్నేహితులతో చేసిన ఓ పందెం ఇప్పుడు ఆయనను అరగుండు వరకు తీసుకెళ్లింది. అదే విషయం సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. శివ, ఎన్నికల ముందు తన స్నేహితులతో “వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే అరగుండు గీయించుకుంటా” అని ఓ ఛాలెంజ్ చేశాడు. అయితే ఎన్నికల ఫలితాల్లో టీడీపీ అఖండ విజయాన్ని సాధించడంతో వైసీపీ అధికారం కోల్పోయింది. ఏడాది దాటి పోయినా, స్నేహితుల గుర్తుచేయటంతో శివ తన మాట నిలబెట్టుకున్నాడు. తన తల ముందు భాగాన్ని గీసించి వీడియో తీసి, ఫొటోలు షేర్ చేయడంతో ఇప్పుడు ఇది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లన్నిటిలో వైరల్ అవుతోంది.
Corona Updates : దేశంలో 3 వేలకు చేరువలో కొవిడ్ కేసులు
ఈ సందర్భంగా శివ ఓ వీడియోను కూడా విడుదల చేశాడు. “నేను నమ్మిన దేవుడు వైఎస్ జగన్. ఆయనపై నమ్మకంతో చేసిన ఛాలెంజ్‌నే నెరవేర్చాను. మాట నిలబెట్టుకోవడం వల్ల కలిగే సంతృప్తి మాటల్లో చెప్పలేను” అని వీడియోలో తెలిపాడు. ఎన్నికల సమయంలో తన నమ్మకంతో కొందరికి డబ్బులు కూడా పెట్టానని, మరికొందరితో ఇదే అరగుండు ఛాలెంజ్ చేశానని చెప్పాడు. వైసీపీ ఓడిపోయిన తరువాత మూడు, నాలుగు నెలలపాటు షాక్ నుంచి తాను కోలుకోలేకపోయానని, చివరికి మాట ఇచ్చినందుకు తన నిబద్ధతగా అరగుండు గీయించుకున్నట్లు వివరించాడు. “ఇప్పుడు అరగుండు తలతో సెంటర్‌లో తిరిగాను. మాట నిలబెట్టుకున్నాననే ఫీలింగ్‌తో కలిగిన కిక్ మామూలుగా లేదు” అంటూ శివ తన భావోద్వేగాలను పంచుకున్నాడు.
K.Keshava Rao : కవిత కాంగ్రెస్‌లో చేరితే పార్టీకి ప్రయోజనం ఉంటుందా..?