Corona Updates : దేశంలో 3 వేలకు చేరువలో కొవిడ్ కేసులు
Corona Updates : దేశంలో కరోనా మహమ్మారి మరోసారి తన పంజా విప్పుతోంది. గత కొన్ని రోజులుగా కేసులు మళ్లీ ఊహించని వేగంతో పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 3,000కు చేరువవుతోంది.
- By Kavya Krishna Published Date - 11:48 AM, Sat - 31 May 25

Corona Updates : దేశంలో కరోనా మహమ్మారి మరోసారి తన పంజా విప్పుతోంది. గత కొన్ని రోజులుగా కేసులు మళ్లీ ఊహించని వేగంతో పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 3,000కు చేరువవుతోంది. ఈ పెరుగుదల తాత్కాలికమా? లేక మరో ముప్పు సంకేతమా అనే ఆందోళనలు ప్రజల్లో మొదలయ్యాయి. మే 26 నాటికి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,010గా ఉన్నప్పటికీ, కేవలం నాలుగు రోజుల్లో – అంటే మే 30 నాటికి – ఈ సంఖ్య 2,710కి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంటే, గడచిన నాలుగు రోజుల్లో యాక్టివ్ కేసులు దాదాపు మూడింతలవగా పెరగడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రాలవారీగా పరిశీలిస్తే, కేరళలో అత్యధికంగా 1,147 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఇది దేశ మొత్తం యాక్టివ్ కేసుల్లో సగానికి పైగా అన్నమాట. మహారాష్ట్రలో 424 కేసులు ఉన్నాయని, ఢిల్లీలో 294 మంది కొవిడ్ బాధితులు ఉన్నారని అధికార గణాంకాలు చెబుతున్నాయి.
Colombia : ఫలించిన భారత్ దౌత్యం..ఉగ్రవాదంపై భారత్ వైఖరికి కొలంబియా సంపూర్ణ మద్దతు
ఇంకా గుజరాత్‌లో 223, తమిళనాడు, కర్ణాటకల్లో ఒక్కొక్కటి 148 చొప్పున, పశ్చిమ బెంగాల్‌లో 116, రాజస్థాన్‌లో 51, ఉత్తరప్రదేశ్‌లో 42 కేసులు ఉన్నాయి. పుదుచ్చేరిలో 25, హర్యానాలో 20 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 16 యాక్టివ్ కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో కేసులు తక్కువగానే ఉన్నాయి – మొత్తం 3 యాక్టివ్ కేసులు మాత్రమే. అయినప్పటికీ, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. అవసరమైతే మరిన్ని టెస్టులు, క్వారంటైన్ చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉందని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లో 10, గోవాలో 7, ఒడిశా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్‌లలో తలా 4 కేసులు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్‌లలో తలా 3, మిజోరాం, అసోంలలో రెండేసి కేసులు నమోదు అయ్యాయి. బీహార్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్ ద్వీపాలలో ఒక్క యాక్టివ్ కేసు కూడా లేకపోవడం గమనార్హం. ఈ నెలలో దేశవ్యాప్తంగా ఏడుగురు కొవిడ్ మృతులు నమోదయ్యారు. వారిలో మహారాష్ట్రలో ఇద్దరు, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.
మరణించిన వారిలో చాలామంది వృద్ధులే కావడంతో పాటు, ఇతర ఆరోగ్య సమస్యలతో కూడిన వారు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. ముఖ్యంగా పంజాబ్‌కు చెందిన బాధితుడిని మినహాయిస్తే, మిగతా ఆరుగురు వృద్ధులే అని పేర్కొన్నారు. కేసుల పెరుగుదలతో మరోసారి ప్రజల్లో అప్రమత్తత అవసరమవుతోంది. మాస్కుల వాడకాన్ని పునఃప్రారంభించాలన్న సూచనలు వస్తున్నాయి. వ్యాక్సిన్ బూస్టర్ డోసుల గురించి కూడా చర్చలు తిరిగి మొదలయ్యాయి. వైద్య నిపుణులు, ప్రజారోగ్య నిపుణులు ప్రజలకు తిరిగి ఒకసారి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, స్వల్ప లక్షణాలు కనిపించిన వెంటనే టెస్టింగ్ చేయించుకోవాలని సూచిస్తున్నారు.
Miss World : మిల్లా మ్యాగీ తో మిస్ బిహేవ్ చేసింది ఆ కాంగ్రెస్ యువ నేతలే..?