YCP Corporator : బెజవాడలో టూరిజం సిబ్బందిపై వైసీపీ కార్పోరేటర్ భర్త దాడి..?
- By Prasad Published Date - 03:34 PM, Mon - 6 June 22

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నేతల అరచకాలు బయటపడుతున్నాయి. ఏపీ టూరిజం సిబ్బందిపై వైసీపీ 42 వ డివిజన్ కార్పొరేటర్ చైతన్యరెడ్డి భర్త ప్రసాద్ రెడ్డి దాడి చేశారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రసాద్ రెడ్డి అనుచరుల ఫొటో షూట్ అడ్డుకున్నందుకు టూరిజం సిబ్బందిపై దాడి చేశారని వారు ఆరోపిస్తున్నారు. సుమారు మూడు కార్లలో 30 మంది యువకులు కర్రలతో హల్ చల్ చేశారు. కార్పొరేటర్ చైతన్యరెడ్డి భర్త ప్రసాద్ రెడ్డి తీరుపై టూరిజం సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై టూరిజం సిబ్బంది పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేయకుండా పోలీసులపై కార్పొరేటర్ ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కార్పోరేటర్ చైతన్య రెడ్డికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వత్తాసు పలుకుతున్నాని టూరిజం సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో గాయపడిన టూరిజం సిబ్బంది చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.