SI Cheating : ఎస్సైపై స్పందనలో ఫిర్యాదు చేసిన మహిళా హోంగార్డు
ఎస్సై మోసం చేశాడంటూ మచిలీపట్నం స్పందన లో ఓ మహిళా హోంగార్డు ఫిర్యాదు చేసింది
- Author : Prasad
Date : 30-08-2022 - 10:30 IST
Published By : Hashtagu Telugu Desk
ఎస్సై మోసం చేశాడంటూ మచిలీపట్నం స్పందన లో ఓ మహిళా హోంగార్డు ఫిర్యాదు చేసింది. బంటుమిల్లి ఎక్సైజ్ ఎస్ఐ కొమ్మా కిషోర్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి సహజీవనం చేశాడని హోంగార్డు నాగలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. భర్త చనిపోయి ఇద్దరు ఆడ పిల్లలతో ఉంటున్నానని.. పెళ్లి చేసుకుంటున్నానని నమ్మించి నాలుగేళ్లుగా కిషోర్ సహజీవనం చేశాడని ఆమె ఆరోపించింది. పదోన్నతికి డబ్బులు అవసరమంటూ పిల్లల పేరుతో రెండున్నర లక్షలు తీసుకున్నాడని.. ఆ డబ్బులు ఇప్పుడు అడిగితే తాను ఎస్ఐని అని… ఏమీ చేయలేవని బెదిరిస్తున్నాడని తెలిపింది. తన డబ్బు తనకు ఇచ్చి.. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది.