IAF Chief AP Singh: ఎయిర్ చీఫ్ మార్షల్ ఆందోళన.. ఎందుకంటే?
ఆయన ఇంకా మాట్లాడుతూ.. ఈ రోజు అవసరం ఈ రోజే తీర్చాలి. అప్పుడే మనం భవిష్యత్తు కోసం సిద్ధం కాగలం. రాబోయే 10 సంవత్సరాలలో పరిశ్రమ నుండి ఎక్కువ ఉత్పత్తి వస్తుంది.
- By Gopichand Published Date - 06:26 PM, Thu - 29 May 25

IAF Chief AP Singh: ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ (IAF Chief AP Singh).. డిఫెన్స్ సిస్టమ్‌ల సేకరణ, డెలివరీలో జరుగుతున్న ఆలస్యం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఒప్పందం సమయంలో ఎందుకు అలాంటి వాగ్దానాలు చేస్తారు. అవి సమయానికి నెరవేర్చలేనివని ఆయన ప్రశ్నించారు. డిఫెన్స్ సిస్టమ్‌లకు సంబంధించిన ఒక్క ప్రాజెక్టూ నిర్ణీత సమయంలో పూర్తి కాలేదు. ఒప్పందాలు సంతకం చేసే సమయంలో కంపెనీలకు తాము సమయానికి డెలివరీ చేయలేమని తెలుసు. అయినప్పటికీ వారు ఒప్పందాలపై సంతకం చేస్తారని మండిపడ్డారు.
భారత వాయుసేన అధిపతి అమర్ ప్రీత్ సింగ్ గురువారం ఢిల్లీలో జరిగిన CII వార్షిక వ్యాపార సదస్సులో మాట్లాడుతూ.. తేజస్, AMCA, Mk2తో సహా ఇతర యుద్ధ విమానాల డెలివరీలో జరుగుతున్న ఆలస్యం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. అమర్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 2021లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)తో తేజస్ MK1A యుద్ధ విమానాల కోసం 48,000 కోట్ల రూపాయల ఒప్పందం జరిగిందని చెప్పారు.
Also Read: Electricity Bill: కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందా? అయితే ఈ తప్పు చేస్తున్నారేమో చూడండి!
HALతో ఎన్ని యుద్ధ విమానాల ఒప్పందం జరిగింది?
ఎయిర్ చీఫ్ మార్షల్ చెప్పిన ప్రకారం.. HALతో 83 విమానాల ఒప్పందం జరిగింది. వీటి డెలివరీ మార్చి 2024 నుండి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఒక్క యుద్ధ విమానం కూడా డెలివరీ కాలేదు. అంతేకాకుండా తేజస్ MK2 రోల్-అవుట్ ఇంకా జరగలేదు. అడ్వాన్స్‌డ్ స్టెల్త్ యుద్ధ విమానం AMCA ప్రోటోటైప్ కూడా లేదన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ.. ఈ రోజు అవసరం ఈ రోజే తీర్చాలి. అప్పుడే మనం భవిష్యత్తు కోసం సిద్ధం కాగలం. రాబోయే 10 సంవత్సరాలలో పరిశ్రమ నుండి ఎక్కువ ఉత్పత్తి వస్తుంది. కానీ ఈ రోజు అవసరాన్ని ఈ రోజే తీర్చాలి. మనం త్వరగా, సమయానికి పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే ఇది ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ డిఫెన్స్ సిస్టమ్ డెలివరీల గురించి ప్రశ్నలు లేవనెత్తిన మొదటిసారి కాదు. ఇంతకుముందు జనవరి 8, 2025న కూడా ఆయన ఈ సమస్యను ప్రస్తావించారు. చైనా వంటి శత్రు దేశం తన వైమానిక శక్తిని పెంచుతోంది. కానీ మనకు 40 జెట్‌లు ఇంకా అందలేదని ఆయన చెప్పారు.