Husband and Wife: పెళ్లైన తర్వాత భార్యభర్తల మధ్య గొడవలు వచ్చే విషయాలు ఏంటంటే..
ఇటీవల పెళ్లి చేసుకునేందుకు చాలామంది వెనకడుగు వేస్తున్నారు. పెళ్లి చేసుకుంటే లైఫ్‌లో ఎంజాయ్‌మెంట్ ఉండదని భావిస్తూ ఉంటారు.
- Author : Anshu
Date : 14-05-2023 - 8:40 IST
Published By : Hashtagu Telugu Desk
Husband and Wife: ఇటీవల పెళ్లి చేసుకునేందుకు చాలామంది వెనకడుగు వేస్తున్నారు. పెళ్లి చేసుకుంటే లైఫ్‌లో ఎంజాయ్‌మెంట్ ఉండదని భావిస్తూ ఉంటారు. భార్య, పిల్లలను చూసుకోవడంతో, పిల్లలను పెద్ద చేయడంతో, వారి చదివించడంతోనే మనం లైఫ్ సరిపోతుందని అనుకుంటూ ఉంటారు. ఇక భార్యతో ఏర్పడే చిన్న చిన్న గొడవలు పెద్దగా మారి విడాకుల వరకు దారితీస్తున్నాయి. దీంతో పెళ్లి చేసుకోవాలంటేనే చాలామంది భయపడుతూ ఉంటారు.
అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ఎలాంటి సమస్యలు వస్తాయనే విషయం చూస్తే… ఇంట్లో పనుల విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. భార్య పనిచేస్తుంటే భర్త పట్టించుకోడు. కనీసం ఏ పనిలోనూ సహాయం చేయరు. దీని వల్ల భార్యకు కోపం వస్తూ ఉంటుంది. ఇక శృంగారం విషయంలో ఒక్కొక్కరికి కొన్ని కోరికలు ఉంటాయి. ఇవి కూడా మనస్పర్థలకు దారితీయవచ్చు. ఇక చిన్నపిల్లల విషయంలోనూ భార్యాభర్తల మధ్య గొడవులు వస్తాయి. పిల్లల బాధ్యతల విషయంలో ఎక్కువగా గొడవలు వస్తాయి.
ఇక పెళ్లయ్యాక పని ఒత్తిడి వల్ల కూడా గొడవలు వస్తాయి. అలాగే అత్తగారి విషయంలో భార్యభర్తల మధ్య మనస్పర్థలు వస్తాయి. కోడలు అంటే అత్తగారికి ఇష్టం ఉండకపోవడం, అత్త అంటే కోడలికి ఇష్టం ఉండకపోవడం వల్ల గొడవలు రావొచ్చు. అలాగే అత్తకు అల్లుడి ప్రవర్తన నచ్చకపోవడం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. ఇక భార్య షాపింగ్ విషయంలో కూడా గొడవలు రావొచ్చని చెబుతున్నారు. ఇలా చాలా విషయాల్లో భార్యభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. ఇలా గొడవలు వచ్చినప్పుడు ఇద్దరూ కూర్చోని ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. అప్పుడు వివాదాలు పరిష్కరం అవుతాయి. అలా కాకుండా ఎవరికి నచ్చినట్లు వాళ్లు ప్రవర్తిస్తే గొడవలు మరింతగా ఎక్కువైపోతాయి. దీని వల్ల వివాహ బంధం వీడిపోవచ్చు.