Fisheries: దేశంలో తీరప్రాంత మత్స్యకార సమస్యలను పరిష్కరిస్తాం: కేంద్రమంత్రి
- Author : Balu J
Date : 02-01-2024 - 1:54 IST
Published By : Hashtagu Telugu Desk
Fisheries: దేశంలో తీరప్రాంతంలో మత్స్యకార సమస్యలను పరిష్కరించే దిశగా కేంద్ర మత్స్య శాఖ మంత్రి పరుషోత్తం రూపాల ఏపీ రాష్ట్రంలోని వివిధ తీరప్రాంత గ్రామాలను పర్యటిస్తున్నారు. సాగర పరిక్రమలో భాగంగా నిజాంపట్నం వద్ద మత్స్యకారులతో ఆయన భేటీ అయ్యారు. వారి సమస్యలను తెలుసుకుని, కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరిస్తున్నారు. గతంలో ఎప్పుడూ చోటుచేసుకొని ఇటువంటి చొరవ వల్ల మత్స్యకారులకు ఎంతో ఉపయోగంగా ఉందని కేంద్ర మంత్రి రూపాల అన్నారు. మత్స్యకారులు ఆక్వా రైతుల సంక్షేమానికి కృషి చేస్తానని కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు.
సాగర పరిక్రమలో భాగంగా మంగళవారం బాపట్ల జిల్లా ఓడరేవు సముద్రతీరంలో ఆయన మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యకారులు ఆక్వా రైతులు చెప్పిన సమస్యలను ఆలకించారు. వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. మత్స్యకారులకు రుణాలను,లైఫ్ బోట్లు పంపిణీ చేశారు. తీరం వెంబడి పర్యటించి మత్స్యకారులు డ్వాక్రా మహిళలు తో ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మత్స్యకారుల సమస్యలను తెలుసుకునేందుకు ఈ సాగర్ పరిక్రమ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. మత్స్యకారులు డీజిల్ సబ్సిడీ పెంపు, రాయితీల పెంపు, బీమా సౌకర్యం వంటి పలు సమస్యలను ప్రస్తావించారని వీటిని సానుకూలంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మంత్రి వెంట రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి జిల్లా అధికారులు కేంద్ర ప్రభుత్వాలు పాల్గొన్నారు.