Kancha Gachibowli Land : TGIICకి మేం లోన్ ఇవ్వలేదు – ICICI
Kancha Gachibowli Land : తాము తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC)కు ఎలాంటి మార్ట్గేజ్ లోన్ మంజూరు చేయలేదని స్పష్టంచేసింది. ఈ మేరకు బ్యాంక్ ఒక ప్రకటన విడుదల చేసింది
- By Sudheer Published Date - 09:28 AM, Sat - 12 April 25

కంచ గచ్చిబౌలి భూములను(Kancha Gachibowli Land) తనఖా(Loan Against property) పెట్టి రూ.10వేల కోట్లు లోన్ (Loan) తీసుకున్నట్లు మాజీ మంత్రి కేటీఆర్ (KTR) చేసిన ఆరోపణలపై ICICI బ్యాంక్ స్పందించింది. తాము తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC)కు ఎలాంటి మార్ట్గేజ్ లోన్ మంజూరు చేయలేదని స్పష్టంచేసింది. ఈ మేరకు బ్యాంక్ ఒక ప్రకటన విడుదల చేసింది.
Hyderabad Glide Bomb: మేడిన్ హైదరాబాద్ గ్లైడ్ బాంబ్.. ‘గౌరవ్’ సక్సెస్.. ఎలా పనిచేస్తుంది ?
తాము కేవలం బాండ్ నిధుల నిర్వహణకు అకౌంట్ బ్యాంకుగా మాత్రమే పనిచేశామని పేర్కొంది. బాండ్ జారీ ప్రక్రియలో వడ్డీ చెల్లింపులు, ఫండ్ల మేనేజ్‌మెంట్‌కు సంబంధించి పరిమితమైన బాధ్యతలే ఉన్నాయని వివరించింది. ఇందులో భూముల తాకట్టు వ్యవహారం ఏదీ తమ క్షేత్రంలోకి రాదని స్పష్టం చేసింది. ఇక ఈ వివాదంపై రాజకీయ వర్గాల్లో విమర్శలు, చర్చలు పెరుగుతున్న వేళ ICICI బ్యాంక్ ఇచ్చిన ఈ క్లారిటీ కీలకంగా మారింది. కేటీఆర్ చేసిన ఆరోపణలకు సంబంధించి వాస్తవ పరిస్థితిని ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. TGIIC మరియు సంబంధిత అధికార వర్గాలు దీనిపై మరింత స్పష్టత ఇవ్వాలన్న వార్తలు వినిపిస్తున్నాయి.