HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Hyderabad Made Glide Bomb Gaurav Test Success What Is It How Does It Work

Hyderabad Glide Bomb: మేడిన్ హైదరాబాద్‌ గ్లైడ్ బాంబ్.. ‘గౌరవ్’ సక్సెస్.. ఎలా పనిచేస్తుంది ?

దీంతో ఈ బాంబును(Hyderabad Glide Bomb) భారత వాయుసేనకు అందించడానికి లైన్ క్లియర్ అయింది.

  • By Pasha Published Date - 08:43 AM, Sat - 12 April 25
  • daily-hunt
Hyderabad Glide Bomb Gaurav Sukhoi Fighter Jet Research Centre Imarat Hyderabad Drdo

Hyderabad Glide Bomb:  హైదరాబాద్‌లో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ (ఆర్‌సీఐ-హైదరాబాద్‌) వేదికగా దీర్ఘశ్రేణి గ్లైడ్‌ బాంబును తయారు చేశారు. దీనికి ‘గౌరవ్’ అని పేరు పెట్టారు. ఈ బాంబు అభివృద్ధి ప్రక్రియలో పూణేలోని ఆర్మమెంట్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఏఆర్‌డీఈ), అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్, భారత్ ఫోర్జ్ వంటి సంస్థలు సహకారాన్ని అందించాయి. దాదాపు 1000 కిలోల బరువు ఉండే  దీర్ఘశ్రేణి గ్లైడ్‌ బాంబు ‘గౌరవ్‌’ను తాజాగా సుఖోయ్‌-30ఎంకేఐ యుద్ధవిమానం నుంచి జారవిడిచి టెస్ట్ చేశారు. ఏప్రిల్ 8 నుంచి 10 వరకు ఈ పరీక్షలు జరిగాయి. నిర్దేశిత 100 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను అది అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. దీంతో ఈ బాంబును(Hyderabad Glide Bomb) భారత వాయుసేనకు అందించడానికి లైన్ క్లియర్ అయింది. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఈ బాంబును తయారు చేయడం విశేషం.

గౌరవ్ ఎలా పనిచేస్తుంది ?

  • దీర్ఘశ్రేణి గ్లైడ్‌ బాంబు ‘గౌరవ్‌’ను గగన తలం (విమానం) నుంచి లక్ష్యం దిశగా జారవిడవాలి. దూరంలోని లక్ష్యాలను కూడా ఇది కచ్చితత్వంతో ఛేదించగలదు.
  • గగనతలం(విమానం) నుంచి జారవిడిచాక.. గరిష్ఠంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ దిశగా ఈ బాంబు కచ్చితత్వంతో వెళ్లగలదు.
  • విమానం నుంచి ఈ బాంబును జారవిడిచాక.. అది తనను తాను లక్ష్యం దిశగా నావిగేట్ చేసుకుంటుంది. ఈ బాంబులోని ఇనెర్షియల్ నావిగేషన్ సిస్టమ్ (ఐఎన్ఎస్), జీపీఎస్ సమాచారం ఇందుకు సహకారాన్ని అందిస్తుంది.

గ్లైడ్ బాంబు గురించి.. 

  • సాధారణంగా విమానం నుంచి గ్రావిటీ బాంబులను జారవిడుస్తుంటారు. అవి కచ్చితంగా లక్ష్యాన్ని తాకలేవు. గ్లైడ్ బాంబులు మాత్రం కచ్చితత్వంతో లక్ష్యాన్ని తాకుతాయి. ఎందుకంటే వీటిలో నావిగేషన్ వ్యవస్థ ఉంటుంది.
  • గ్లైడ్ బాంబు లక్ష్యం దిశగా ప్రయాణించే క్రమంలో తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి రెక్కలు ఉంటాయి. జీపీఎస్, నేవిగేషన్ సిగ్నల్స్ ఆధారంగా ఇది తన లక్ష్యం దిశగా వెళ్తుంది.
  • శత్రువుల భూభాగానికి గరిష్ఠంగా 100 కి.మీ దూరంలో ఉండి కూడా యుద్ధ విమానం నుంచి ఈ బాంబులను జారవిడవవచ్చు. ఇవి వెళ్లి శత్రువుల భూభాగంలో పడి విధ్వంసాన్ని క్రియేట్ చేస్తాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • DRDO
  • Glide Bomb
  • Glide Bomb Gaurav
  • hyderabad
  • Hyderabad Glide Bomb
  • Research Centre Imarat
  • Sukhoi Fighter Jet

Related News

Jubilee Hills

Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు!

రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ అయిన మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం సీపీఐ కార్యాలయం మాగ్దూం భవన్‌లో సీపీఐ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.

  • Liquor Shops

    Liquor Shops: మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు!

  • Jubilee Hills

    Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. నోటిఫికేష‌న్ విడుద‌ల‌!

  • Lokesh Vizag

    Vizag Development : హైదరాబాద్ కు 30 ఏళ్లు.. విశాఖకు 10 ఏళ్లు చాలు – లోకేశ్

Latest News

  • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

  • Diwali 2025 Discount: దీపావళికి ముందే టయోటా నుంచి మ‌రో కారు.. ఫీచ‌ర్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  • Rohit Sharma- Virat Kohli: రోహిత్, విరాట్ భవిష్యత్తుపై అజిత్ అగార్కర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌!

  • Telangana Bandh : రేపే బంద్.. డీజీపీ హెచ్చరికలు

  • TTD: తిరుమ‌ల శ్రీవారి భక్తుల‌కు శుభ‌వార్త‌..!

Trending News

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    • Ramya Moksha Kancharla : రేయ్ డీమాన్ సుడి రా నీకు.. పచ్చళ్ల పాప రీతూ పాప.. మధ్యలో మాధురి..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd