Vande Metro Trains: త్వరలోనే రానున్న వందే భారత్ మెట్రో రైళ్లు..!
కేంద్ర బడ్జెట్‌లో రైల్వేశాఖ (Railway Ministry) కు మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో
- Author : Maheswara Rao Nadella
Date : 02-02-2023 - 11:40 IST
Published By : Hashtagu Telugu Desk
కేంద్ర బడ్జెట్‌లో రైల్వేశాఖ (Railway Ministry)కు మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కేటాయింపులు చేసిన వేళ.. రైల్వే మంత్రి నుంచి కీలక ప్రకటన వెలువడింది. పెద్ద నగరాలకు సమీప ప్రాంతాల నుంచి వేగంగా రాకపోకలు జరిపేందుకు వీలుగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు (Vande Bharat Express Trains) మినీ వెర్షన్ ‘వందే మెట్రో’ రైళ్లను (Vande Metro Trains) ప్రవేశపెట్టబోతున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, పర్యాటకులకు ఇవి వెసులుబాటుగా ఉంటాయన్నారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) మీడియాతో మాట్లాడారు.
‘‘వందే భారత్” తరహాలోనే ‘వందే మెట్రో’ లను కూడా అభివృద్ధి చేస్తున్నాం. పెద్ద నగరాల చుట్టుపక్కల 50-60 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారు పనికోసం నగరానికి వచ్చి మళ్లీ తమ స్వస్థలాలకు సత్వరం చేరుకునేలా చేయడానికి వందే భారత్ మెట్రోని తీసుకురావాలని ప్రధానమంత్రి సంకల్పించారు. వందే మెట్రో (Vande Metro Trains) ల రూపకల్పన, తయారీ ఈ ఏడాదే పూర్తవుతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వీటిని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం.
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆ రైళ్ల ఉత్పత్తిని పెంచుతాం’’ అని రైల్వే మంత్రి వెల్లడించారు. ఇప్పుడున్న వందే భారత్ రైళ్లలో 16 బోగీలున్నాయి. అయితే మెట్రో రైళ్ల మాదిరిగానే ఈ వందే మెట్రోలనూ ఎనిమిది బోగీలు ఉండనున్నట్లు అధికారులు వెల్లడించారు. వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులకు ఈ వందే మెట్రో ఎంతగానో వెసులుబాటు కల్పిస్తుందని తెలిపారు.
Also Read: Madras High Court: మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు.. భర్తకు ముస్లిం మహిళ విడాకులు..