IND vs AUS T20 : బ్లాక్ మార్కెట్‌లో క్రికెట్ మ్యాచ్ టికెట్లు.. ఇద్దరు స్టూడెంట్స్ అరెస్ట్
హైదరాబాద్ లో ఈ రోజు జరగనున్న ఇండియ, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌కి సంబంధించిన టికెట్లు...
- By Prasad Published Date - 07:42 AM, Sun - 25 September 22

హైదరాబాద్ లో ఈ రోజు జరగనున్న ఇండియ, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌కి సంబంధించిన టికెట్లు బ్లాక్ మార్కెట్‌కి చేరాయి. క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాక్ మార్కెటింగ్ చేయడంపై రాచకొండ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్‌ఓటీ) అధికారులు దృష్టి సారించారు. అక్రమంగా టిక్కెట్లు విక్రయిస్తున్న ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఎంఎస్సీ సెంకడ్ ఇయర్ చదువుతున్న గుడిదేవుని మచ్చేంద్ర (23), అతని సహచరుడు గాదం భరత్ రెడ్డి (21)లు రూ. 1,500 టిక్కెట్లు రూ. 6,000లకు అమ్ముతూ పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించిన రెండు టిక్కెట్లు, మొబైల్ ఫోన్‌లను ఎస్‌ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం వారిని చైతన్యపురి పోలీసులకు అప్పగించారు.