2 Killed : ఢిల్లీలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి, ఒకరికి గాయాలు
దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం సృష్టించాయి. బక్కర్‌వాలా ప్రాంతంలో ...
- By Prasad Published Date - 10:48 AM, Tue - 23 August 22

దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం సృష్టించాయి. బక్కర్‌వాలా ప్రాంతంలో దుండగులు జరిపిన దాడిలో ఇద్దరు వ్యక్తులు చనిపోగా.. మరొకరు గాయపడ్డారు ఈ ఘటన బక్కర్‌వాలాలోని జేజే కాలనీలోని బీ బ్లాక్‌లో సోమవారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో జోగేందర్, మంగళ్, మోహన్ లాల్‌లకు తుపాకీ గాయాలయ్యాయి. జోగేందర్‌ని సెహగల్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మంగళ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.ప్రస్తుతం మోహన్ లాల్ చికిత్స పొందుతున్నాడు. జోగేందర్, మంగళ్‌ల మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం సంజయ్‌గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన వెనుక అసలు కారణాలను తెలుసుకునేందుకు కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.