Accident : హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవంలో అపశృతి.. వేర్వేరు ఘటనలో ఇద్దరు మృతి
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనోత్సవంలో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు బాలురు మృతి చెందారు. ఈ సంఘటనలు గురువారం
- By Prasad Published Date - 04:01 PM, Fri - 29 September 23

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనోత్సవంలో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు బాలురు మృతి చెందారు. ఈ సంఘటనలు గురువారం అర్థరాత్రి జరిగాయి. హుస్సేన్ సాగర్ సరస్సుకు ఆనుకుని ఉన్న సంజీవయ్య పార్కు సమీపంలో జరిగిన మొదటి ఘటనలో నిమజ్జనం కోసం విగ్రహాన్ని తీసుకెళ్తున్న ట్రక్కుపై నుంచి పడి ఓ బాలుడు మృతి చెందాడు. మృతుడు నగరంలోని కిషన్‌బాగ్‌కు చెందిన ప్రణీత్‌కుమార్‌గా గుర్తించారు. రెండో ఘటనలో ద్విచక్ర వాహనంపై నుంచి పడి ఆయూష్ అనే బాలుడు మృతి చెందాడు. ఆయుష్ తన తల్లిదండ్రులతో కలిసి నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్ సరస్సు వద్దకు వెళ్తుండగా బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మోటర్‌బైక్‌పై వెళ్తున్న ఆయుష్ తండ్రి రాజశేఖర్ అదుపు తప్పి కిందపడిపోయారు. తీవ్రంగా గాయపడిన బాలుడిపై నుంచి మరో వాహనం దూసుకెళ్లింది. అతడిని నీలోఫర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.