TTD : రేపు శ్రీవారి అర్జిత సేవా టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల అక్టోబరు నెల కోటాను బుధవారం ఉదయం
- By Prasad Published Date - 10:05 AM, Tue - 23 August 22

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల అక్టోబరు నెల కోటాను బుధవారం ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అదే నెలకు సంబంధించి మరికొన్ని ఆర్జిత సేవా టికెట్లకు ఆన్‌లైన్‌లో లక్కీడిప్ నమోదు ప్రక్రియ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటా, వాటికి సంబంధించిన దర్శన టికెట్ల కోటా అదేరోజు సాయంత్రం 4 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల కానుంది. మరోవైపు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు తిరుమలకు భారీగా తరలి వస్తున్నారు. సోమవారం సాయంత్రానికి ధర్మదర్శనానికి క్యూలైన్‌లో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఎంబీసీ వరకు వేచి ఉన్నారు. వీరికి దాదాపు 16 గంటల్లో స్వామివారి ద]ర్శనం లభిస్తోంది. గదుల కోసం రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని ఆదివారం 81,523 మంది భక్తులు దర్శించుకున్నారు.