Train Derailment: తప్పిన మరో రైలు ప్రమాదం.. ట్రాక్‌పై 70 కిలోల సిమెంట్ దిమ్మె..!
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్‌ను పరిశీలించగా ఓ విస్మయకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ట్రాక్‌పై నుంచి సిమెంట్ దిమ్మె ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.
- By Gopichand Published Date - 10:05 AM, Tue - 10 September 24

Train Derailment: రైలు ప్రమాదాలకు దారితీసే సంఘటనలు రోజుకో వెలుగులోకి వస్తున్నాయి. నిన్న రైల్వే ట్రాక్‌పై సిలిండర్‌ను ఉంచారు. నేడు రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో మళ్లీ రైలు పట్టాలు (Train Derailment) తప్పేందుకు కుట్ర పన్నారు. అయితే ఈ కుట్ర విఫలమైంది. అజ్మీర్‌లోని రైల్వే ట్రాక్‌పై సిమెంట్ దిమ్మెలు వేసి రైలు పట్టాలు తప్పేందుకు పథకం వేశారు. ఈ సిమెంట్ దిమ్మె చిన్నదేమి కాదు 70 కిలోల బరువు ఉన్నట్లు తెలుస్తోంది.
రైలు పెను ప్రమాదం తప్పింది
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో నిన్న రాత్రి ఘోర రైలు ప్రమాదం తప్పింది. కొందరు వ్యక్తులు రైల్వే ట్రాక్‌పై 70 కిలోల సిమెంట్ దిమ్మెను వేశారు. ఈ కుట్రలో ఫులేరా నుంచి అహ్మదాబాద్ వెళ్తున్న రైలును బోల్తా కొట్టేందుకు కుట్ర జరిగింది. కానీ ఈ కుట్ర విఫలమైంది. రైలు ఇంజన్ సిమెంట్ దిమ్మెను ధ్వంసం చేసి ముందుకు కదలడంతో రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఒకవేళ ప్రమాదం జరిగి ఉంటే నష్టం ఊహించడం కష్టమేనని ప్రయాణికులు సైతం ఆందోళన చెందారు.
Also Read: Ather Energy IPO: ఐపీఓకు ఏథర్ ఎనర్జీ.. రూ. 3100 కోట్లు లక్ష్యం..!
Rashthan: राजस्थान के अजमेर में ट्रेन को पलटाने की साजिश नाकाम।
रविवार को कानपुर में ट्रेन को डिरेल करने की साजिश रची गई थी।अजमेर के फुलेरा से अहमदाबाद रेल मार्ग पर ट्रेन को डिरेल करने की साजिश। सीमेंट के 70 किलो वजनी ब्लॉक रखे ट्रैक पर।#Train #TrainTerrorConspiracy pic.twitter.com/hFMMqc1rZ5
— Sakshi (@sakkshiofficial) September 10, 2024
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు
ఈ ఘటన తర్వాత రైలు డ్రైవర్ ఆర్పీఎఫ్‌కు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్‌ను పరిశీలించగా ఓ విస్మయకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ట్రాక్‌పై నుంచి సిమెంట్ దిమ్మె ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. వాటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అయితే ట్రాక్‌పై దిమ్మెలు ఎవరూ పెట్టారు..? ఇది ఆకతాయిల పనా లేకుంటే ఉగ్రవాదుల హస్తం ఏమైనా ఉందా అనే కోణం అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
నివేదిక ప్రకారం.. ట్రాక్ పై సిమెంట్ దిమ్మె వేసినట్లు సెప్టెంబర్ 8న రాత్రి 10:36 గంటలకు సమాచారం అందింది. సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా అది శిథిలావస్థకు చేరుకుంది. ఒక కిలోమీటరు ముందుకి మరో దిమ్మను పగలగొట్టి పక్కన పెట్టారు. అయితే ఇదే విధంగా 2 రోజుల క్రితం యూపీలోని కాన్పూర్‌లో రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్ పెట్టిన విషయం తెలిసిందే.
నెలలో మూడో కుట్ర
1 నెలలో రాజస్థాన్‌లో ఇది మూడో కుట్ర. అంతకుముందు ఆగస్టు 28న బరాన్ నుంచి ఛబ్రాకు వెళ్తున్న గూడ్స్ రైలు ట్రాక్‌పై బైక్ స్క్రాప్ కనిపించింది. గూడ్స్ రైలు ఇంజన్ దానిని ఢీకొట్టింది. ఆగస్టు 23న అహ్మదాబాద్-జోధ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను దారి మళ్లించేందుకు పాలి వద్ద సిమెంట్ దిమ్మెలు వేశారు.