Coromandel Express : పట్టాలెక్కిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్!
ఒడిశాలోని బాలాసోర్ వద్ద ప్రమాదానికి గురై విషాదాన్ని నింపిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ (Coromandel Express) రైలు మళ్లీ పట్టాలెక్కింది.
- By Maheswara Rao Nadella Published Date - 12:16 PM, Tue - 6 June 23

Coromandel Express : ఒడిశాలోని బాలాసోర్ వద్ద ప్రమాదానికి గురై విషాదాన్ని నింపిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు మళ్లీ పట్టాలెక్కింది. ప్రమాదం తర్వాత రైల్వే అధికారులు చాలా రైళ్లను రద్దు చేశారు. ఆ తర్వాత 51 గంటలు నిరంతరాయంగా శ్రమించిన సిబ్బంది ట్రాక్‌ను పునరుద్ధరించి రైళ్ల రాకపోకలకు మార్గాన్ని సుగమం చేశారు. మూడు రోజుల తర్వాత చెన్నై-షాలిమర్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ (Coromandel Express) మళ్లీ పట్టాలెక్కింది. ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు రైలు బయలుదేరుతున్నట్టు ఫోన్ కు మెసేజ్‌ల ద్వారా సమాచారం అందించారు. నిన్న ఉదయం 10.45 గంటలకు చెన్నైలోని ఎంజీఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి రైలు తిరిగి బయలుదేరింది.
Also Read: CBI Steps In : రంగంలోకి సీబీఐ.. ఒడిశా రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తు