Dutee Chand Ban: అథ్లెట్ ద్యుతీ చంద్‌పై 4 సంవత్సరాల నిషేధం.. కారణమిదే..?
భారత అథ్లెట్ ద్యుతీ చంద్‌పై నాలుగేళ్ల నిషేధం (Dutee Chand Ban) పడింది. డోపింగ్ కారణంగా ఆమెపై నిషేధం విధించారు. ద్యుతీకి డోపింగ్ పరీక్ష జరిగింది.
- Author : Gopichand
Date : 18-08-2023 - 3:08 IST
Published By : Hashtagu Telugu Desk
Dutee Chand Ban: భారత అథ్లెట్ ద్యుతీ చంద్‌పై నాలుగేళ్ల నిషేధం (Dutee Chand Ban) పడింది. డోపింగ్ కారణంగా ఆమెపై నిషేధం విధించారు. ద్యుతీకి డోపింగ్ పరీక్ష జరిగింది. అందులో నిషేధిత సెలెక్టివ్ ఆండ్రోజెన్ రిసెప్టర్ మాడ్యులేటర్లు (SARMs) కనుగొనబడ్డాయి. ద్యుతీపై విధించిన నాలుగేళ్ల నిషేధం జనవరి 2023 నుంచి పరిగణించబడుతుంది. 2021లో గ్రాండ్ ప్రిక్స్‌లో 100 మీటర్ల రేసును 11.17 సెకన్లలో పూర్తి చేసి జాతీయ రికార్డు సృష్టించింది. నిషేధానికి సంబంధించిన లెటర్ అందుకున్నప్పటి నుంచి 21 రోజులలోపు తనపై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ ద్యుతీచంద్ రివ్యూ పిటిషన్ వేసుకోవచ్చని తెలిపింది.
ఆసియా క్రీడలు 2018లో ద్యుతీ 100 మీటర్లు, 200 మీటర్లలో రెండు స్వర్ణ పతకాలను గెలుచుకుంది. ‘ది బ్రిడ్జ్’లో ప్రచురించిన వార్తల ప్రకారం.. నాడా అధికారులు గత సంవత్సరం ద్యుతీ నమూనాను తీసుకున్నారు. ద్యుతీ మొదటి నమూనాలో ఆండారిన్, ఆస్టారిన్, లింగండ్రోల్ కనుగొనబడ్డాయి. రెండవ నమూనాలో ఆండారిన్, ఓస్టారిన్ కనుగొనబడ్డాయి. ద్యుతీకి బి శాంపిల్ టెస్ట్ ఇచ్చే అవకాశం వచ్చింది. ఇందుకోసం ఆమెకి 7 రోజుల సమయం ఇచ్చారు. కానీ ద్యుతీ టెస్టులకు వెళ్ళలేదు.
Also Read: Richest Actress: ఆసియాలో రిచెస్ట్ హీరోయిర్ ఎవరో తెలుసా, 900 కోట్ల ఆస్తులతో టాప్ ప్లేస్
ఈ ఏడాది జనవరిలో ద్యుతీని నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) సస్పెండ్ చేసింది. ఈ కారణంగా ఆమె ఇప్పటివరకు అన్ని పోటీల నుండి నిష్క్రమించింది.ఆమె ప్రస్తుతం జాతీయ శిబిరంలో భాగం కాదు. ద్యుతీకి డోపింగ్ టెస్ట్ 5 డిసెంబర్ 2022న భువనేశ్వర్‌లో జరిగింది. ద్యుతీ చంద్ బలమైన ప్రదర్శన ఆధారంగా ఆసియా క్రీడలు 2018లో 100మీ, 200మీలో రెండు స్వర్ణ పతకాలు సాధించింది. అంతకుముందు పూణెలో జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్ 2013లో కాంస్య పతకాన్ని సాధించింది. 2017లో భువనేశ్వర్‌లో కాంస్యం కూడా సాధించింది. దక్షిణాసియా క్రీడలు 2016లో రజత పతకాన్ని గెలుచుకుంది.