Richest Actress: ఆసియా రిచెస్ట్ హీరోయిన్ గా చైనా బ్యూటీ, బాలీవుడ్ హీరోయిన్స్ సైతం వెనక్కే!
ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. వీరికి కోట్ల ఆస్తులు ఉన్నాయి.
- By Balu J Published Date - 02:56 PM, Fri - 18 August 23
ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. వీరికి కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఈ జాబితాలో చాలా మంది నటీమణుల పేర్లు కూడా ఉన్నాయి, అయితే ఆసియాలోనే అత్యంత సంపన్న నటి అనగానే మన బాలీవుడ్ హీరోయిన్స్ వెంటనే గుర్తుకువస్తారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, ధనిక తారల జాబితాలో మనదేశ హీరోయిన్స్ నిస్సందేహంగా చోటు దక్కించుకున్నారు. కానీ మనం ఆసియాలోని అత్యంత ధనిక నటి గురించి మాట్లాడినట్లయితే చాలామంది దీపికా లేదా ఐశ్వర్య రాయ్ అని సమాధానమిస్తారు.
కానీ వాస్తవానికి మరో నటి ఆ జాబితాలో ముందుంది. 900 కోట్ల ఆస్తులున్న చైనా నటి ‘ఫ్యాన్ బింగ్‌బింగ్’. దీనితో పాటు, ఆమె ఆసియాలోనే అత్యంత సంపన్న నటి కూడా. ‘ఫ్యాన్ బింగ్‌బింగ్’ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రతిచోటా ఆమెకు ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ చైనాతో పాటు అనేక హాలీవుడ్ చిత్రాలలో కూడా తన సత్తా చాటింది. అయితే ఈ బ్యూటీపై అనేక విమర్శలున్నాయి. పలు చిత్రాలలో ఆమె అందుకున్న పారితోషకాన్ని పన్ను విధించకుండా కాంట్రాక్టులు విభజించి కుంభకోణానికి పాల్పడిందని అధికారులు ఆరోపిస్తున్నారు. కేసు నేపథ్యంలో ఆమె భయపడి అమెరికా పారిపోయిందనే ఉహాగానాలు సైతం గతంలో వినిపించాయి.
అత్యధిక ఆదాయం గత ఏడాది అత్యధిక ఆదాయం ఆర్జించిన చైనా ప్రముఖుల ఫోర్బ్స్ జాబితాలో బింగ్ బింగ్ చోటు దక్కించుకుంది కూడా. మరోవైపు, మనం భారతీయ నటీమణుల గురించి మాట్లాడినట్లయితే, ఐశ్వర్య రాయ్ పేరు భారతదేశంలోని అత్యంత ధనిక నటి జాబితాలో చేర్చబడింది. ఐశ్వర్య రాయ్ ఆస్తుల విలువ దాదాపు 800 కోట్లు. 600 కోట్ల నికర ఆస్తులతో ప్రియాంక చోప్రా రెండో స్థానంలో ఉంది. అదే సమయంలో అలియా భట్ ఆస్తుల విలువ దాదాపు 520 కోట్లు. దీపిక నికర విలువ 500 కోట్లు.
Also Read: Begging Racket: హైదరాబాద్ లో బెగ్గింగ్ మాఫియా గుట్టు రట్టు, 23 మంది పట్టివేత
Related News
Kalki 2898 AD : ‘కల్కి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేట్ ఫిక్స్ అయ్యిందట.. ఎప్పుడంటే..?
ప్రభాస్ 'కల్కి' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేట్ ఫిక్స్ అయ్యిందట. ఎప్పుడు, ఎక్కడో తెలుసా..?