HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Top 10 Players Who Can Win Orange Cap This Season

IPl 2022: ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్న ఆటగాళ్లు వీళ్ళే

ఐపీఎల్ అనగానే గుర్తొచ్చేది బ్యాటర్లు ఆడే భారీ షాట్లే. ప్రతి సీజన్లోనూ అత్యధిక పరుగులు చేసి రికార్డులు నెలకొల్పిన ఆటగాళ్లు చాలామంది ఉన్నారు.

  • Author : Hashtag U Date : 21-03-2022 - 12:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
tata ipl 2022
tata ipl 2022

ఐపీఎల్ అనగానే గుర్తొచ్చేది బ్యాటర్లు ఆడే భారీ షాట్లే. ప్రతి సీజన్లోనూ అత్యధిక పరుగులు చేసి రికార్డులు నెలకొల్పిన ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. ఈ ఏడాది కూడా తమ అద్భుత బ్యాటింగ్ తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ సీజన్ లో ఆరెంజ్ క్యాప్ దక్కించుకునే అవకాశమున్న టాప్-10 బ్యాటర్లు ఎవరనే దానిపై విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓపెనర్ ఋతురాజ్ గైక్వాడ్ మరోసారి ఆరెంజ్ క్యాప్ దక్కించుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. గత సీజన్లో ఎక్కువ పరుగులు చేసిన ఇతడు.. ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు. అలాగే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈసారి ఆరెంజ్ క్యాప్ దక్కించుకునే అవకాశం ఉంది.. ఇక ముంబై ఇండియన్స్ ఈసారి మెగా వేలంలో భారీ మొత్తానికి కొనుగోలు చేసిన యువ సంచలనం ఇషాన్ కిషన్ సైతం ఈసారి టోర్నీలో ఆరెంజ్ క్యాప్ గెలిచే ఛాన్స్ ఉంది.. వీరితో పాటుగా ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసిన విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్.. కేకేఆర్ కొనుగోలు చేసిన స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ సైతం ఈసారి సీజన్లో ఆరెంజ్ క్యాప్ దక్కించుకునే ఛాన్స్ ఉంది.. అలాగే పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసిన సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కూడా ఈసారి ఐపీఎల్ లో ఆరెంజ్ క్యాప్ దక్కించుకునే అవకాశం ఉంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ సారథి కేన్ విలియం సన్, గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుబ్ మాన్ గిల్, లక్నో సూపర్ జాయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా ఈసారి ఐపీఎల్ లో ఆరెంజ్ క్యాప్ దక్కించుకునే అవకాశం ఉంది.
ఐపీఎల్‌ 2022 సీజన్‌ మరికొన్ని రోజుల్లో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ఈసారి ఐపీఎల్ ను మహారాష్ట్ర లోనే నిర్వహిస్తున్నారు. వాంఖడే వేదికగా మార్చి 26న జరగనున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తలపడనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IPL 2022
  • orange cap
  • Ruturaj Gaikwad
  • shreyas iyer
  • Shubham gill
  • virat kohli

Related News

Rohit Sharma-Virat Kohli

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

ఇప్పుడు వన్డేల్లో కూడా టీమ్ ఇండియా అదే దశలో ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్‌లో దిగ్గజాలే అయినప్పటికీ నివేదికల ప్రకారం వారు ప్రదర్శన ఆధారంగానే జట్టులో కొనసాగుతారు.

  • Smriti Mandhana created history by surpassing Rohit Sharma to become India's leading T20I run scorer

    Smriti Mandhana: విరాట్ కోహ్లీ, రోహిత్ లను అధిగమించి స్మృతి మంధాన రికార్డ్ ..!

  • Virat Kohli

    నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

  • Shreyas Iyer Catch

    Shreyas Iyer Catch : అయ్యర్ క్యాచ్ పై సచిన్ ప్రశంసలు..అత్యుత్తమ క్యాచ్లలో ఇది ఒకటి !

  • Pulled back the catch Shreyas Iyer

    Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పింది.

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd